Hair Tips : జుట్టు పట్టుకుచ్చులా నల్లగా మారటానికి ఈ ఆకు ఒక్కటి చాలు..

Hair Tips : ఒకప్పుడు పెద్దవారిలో మాత్రమే తెల్ల వెంట్రుకలు కనిపించేవి.. ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా తెల్ల వెంట్రుకలు ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా జుట్టు నల్లగా ఉండకుండా పేలవంగా మారిపోతుంది. నల్లటి కేశిల కోసం తుమ్మెద రెక్కల లాంటి జుట్టు కోసం ఆయుర్వేద వైద్యంలో గుంటగలగర ఆకు కీలక పాత్ర పోషిస్తుంది.. నల్లయని ఒత్తయిన కురులు కోసం గుంటగలగర ఆకులు ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Advertisement

ముందుగా గుంటగలగర ఆకు చెట్టు వేర్లతో సహా తీసుకోవాలి. దీనిని శుభ్రంగా కడగాలి. తరువాత దీనిని మొత్తాన్ని మెత్తగా నూరుకోవాలి. ఈ చెట్టు మిశ్రమం ఒక కప్పు అయితే దానికి నాలుగు కప్పుల నువ్వుల నూనె లేదంటే నాలుగు కప్పుల కొబ్బరి నూనెను కలిపి సన్నని సెగ మీద మరిగించాలి. ఈ మిశ్రమంలోని తేమ ఇగిరిపోయే వరకు మరిగించాలి. ఆ తరువాత ఈ నూనెను వడపోసుకొని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు ఈ నూనెతో జుట్టు కుదుల నుంచి చివర్ల వరకు మర్దన చేసుకోవాలి.

Black hair use guntagalagara leaf oil for excellent results
Black hair use guntagalagara leaf oil for excellent results

ఈ నూనెను రాసుకోవడం వలన చిన్న వయసులోనే మెరిసిన జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు రాలిపోవడం ఆగిపోయి జుట్టుకి బలాన్ని అందిస్తుంది. కంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. జుట్టు చివర్లు చిట్లిపోకుండా కూడా చేస్తుంది.
వారంలో రెండు రోజులు ఈ నూనె రాసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

గుంటగలగర చెట్టు వేర్ల భాగాన్ని తీసుకొని శుభ్రంగా నూరి ఆ మిశ్రమాన్ని పేనుకొరుకుడు ఉన్న చోట రాస్తే.. పేనుకొరుకుడు సమస్య త్వరగా తగ్గుతుంది. అంతేకాకుండా ప్లేస్ లో కొత్త జుట్టు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

 

Advertisement