Hair Tips : ఈ రోజుల్లో ఎక్కువ మంది బాధపడుతున్న సమస్యలను జుట్టు రాలడం కూడా ఒకటి.. నల్లని ఒత్తయిన కురులు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు చెప్పు కాబోయే విషయాలను పాటిస్తే కచ్చితంగా జుట్టు ఒత్తుగా పెరగడంతో పాటు అనేక రకాల కేశాల సమస్యలు కూడా దూరమవుతాయి.. బయోటిన్ డ్రింక్ ఏ విధంగా జుట్టు సమస్యలను తగ్గిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
మనం ఎంతైతే బరువు ఉంటామో ఆ బరువుకి ఒక శాతం వంతు ప్రోటీన్ ను ప్రతిరోజు మన డైట్ లో తీసుకోవాలి. ఇలా ప్రతిరోజు మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందించడం వల్ల బరువు తగ్గుతాము అదేవిధంగా ప్రోటీన్ తీసుకోవడం వలన జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. జుట్టు ఎక్కువగా రాలిపోయేవారు బయోటిన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే బయోటిన్ డ్రింక్ కనుక ప్రతిరోజు తీసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతోని అనడంలో సందేహం లేదు.. దీనిని 15 రోజుల పాటు తీసుకోవాలి..
నువ్వులు , నల్ల ద్రాక్ష, డేట్స్, పిస్తా, గుమ్మడి గింజలు, బాదం, ఎండు ఖర్జూరాలు, వాల్ నట్స్, పుచ్చ గింజలు, జీడిపప్పు , అంజీర -1, వీటన్నింటిని ఒక చెంచా చొప్పున తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఉదయం ఇది నానిన తర్వాత వీటన్నింటినీ కలిపి మిక్సీ పట్టుకొని జ్యూస్ లాగా చేసుకోవాలి. ఇందులో ఎటువంటి చక్కెర అనేది కలుపుకోవల్సిన అవసరం లేదు. దీనిని ఇలాగే తీసుకోవాలి.
ఈ బయోటిన్ డ్రింకును 15 రోజుల పాటు వరుసగా తీసుకొని మరో వారం రోజుల పాటు గ్యాప్ ఇచ్చి మళ్లీ వరుసగా తీసుకోవాలి ఇది ఈ డ్రింక్ తీసుకోవడం వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు ఊడటం, రాలడం కూడా తగ్గుతుంది. అంతేకాదు మీకు మజిల్ స్త్రెంగ్ కూడా వస్తుంది. 15 రోజులపాటు ఈ బయోటిన్ డ్రింక్ తీసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి..