Cholesterol : శరీరంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించే బెస్ట్ పానీయాలు..!!

Cholesterol : మన ఆహార అలవాట్లు వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి ఎన్నో సమస్యలకు దారితీస్తున్నాయి. మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్‌లు ఉంటాయి. అవి మంచి కొలెస్ట్రాల్ HDL మరియు చెడ్డ కొలెస్ట్రాల్ LDL మరియు గ్లిసరైడ్‌లు.శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ శాంత పెరిగి ధమనులలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది.ఇది గుండెకు రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. కాబట్టి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం చాలా ముఖ్యం. కాబట్టి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఏ పానీయాలు ఉపయోగపడతాయో చూద్దాం.

టమోటా రసం : టమోటాలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్,నియాసిన్ మరియు కొలెస్ట్రాల్-తగ్గించే ఫైబర్ టమోటాలలో ఉంటాయి. రెండు నెలల పాటు రోజూ 260 మి.లీ టమోటా రసం తాగితే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

గ్రీన్ టీ : యాంటీఆక్సిడెంట్లకు గ్రీన్ టీ గొప్ప మూలం. గ్రీన్ టీలో కాటెచిన్స్ మరియు ఎపిగలోకాటెచిన్ గ్యాలెట్‌లు ఉంటాయి. సాయంత్రం పూట త్రాగడం అలవాటు చేసుకుంటే చెడు కొలెస్ట్రాల్ కి చెక్ పెడుతుందని ఆరోగ్యానిపుణులు సూచిస్తారు.

Best Drinks to Lower Cholesterol in the Body
Best Drinks to Lower Cholesterol in the Body

సోయా పాలు : సోయా పాలలో తక్కువ స్థాయి సంతృప్త కొవ్వు ఉంటుంది. కొవ్వు స్థాయిలను నియంత్రిస్తుంది. ఫుడ్ అండ్ డ్రగ్ అసోసియేషన్ (FDA) ప్రకారం, సంతృప్త కొవ్వు తక్కువగా ఉండే ఆహారం మరియు రోజుకు 25 గ్రాముల సోయా ప్రోటీన్ సిఫార్సు చేయబడింది.

రెడ్ వైన్ : మితంగా తాగడం వల్ల రక్తంలో హెచ్‌డిఎల్ స్థాయిలు పెరుగుతాయి. ముఖ్యంగా రెడ్ వైన్. రెడ్ వైన్ యొక్క యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది రెడ్ వైన్ లిమిట్గా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

వోట్ మిల్క్ : కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో వోట్ పాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో బీటా-గ్లూకాన్ అనే పదార్థం ఉంటుంది.దీనివల్ల ప్రేగులో ఒక పొరలాంటి నిర్మాణం ఏర్పడి ఆహారంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అబ్సర్బ్ చేసుకోనివ్వదు.

సిట్రస్ పండ్ల రసం : సిట్రస్ పండ్ల రసం గొప్ప యాంటీఆక్సిడెంట్-బూస్టర్‌గా పనిచేస్తుంది. మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా ఇది చాలా సహాయపడుతుంది. పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనే మిక్స్ చేసి త్రాగడం వల్ల సైడ్ ప్యాట్ అంతా ఈజీ గా ఐస్క్రీం కరిగినట్టు కరిగిపోతుంది అని ఆయుర్వేద నిపుణులు సూచిస్తారు..

బెర్రీ జ్యుస్.. బెర్రీ లు మనకు రకరకాల రంగుల్లో దొరుకుతాయి. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్, పైబర్ వల్ల చెడు కొలెస్ట్రాల్ ని ఈజీగా కరిగిస్తుంది. బెర్రీ, పాలు కలిపి రోజూ జ్యూస్ చేసి త్రాగడం వల్ల మంచి ఫలితాలుంటాయి.