Beauty Tips : ప్రతి స్త్రీ తన మొహం అందంగా ఉండాలని కోరుకుంటారు. అందుకే వారు అందంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారు. దీనికోసం ఇంటి చిట్కాలనే ఎక్కువగా అనుసరిస్తున్నారు.అలాంటి ఇంటి చిట్కాలలో ముఖ్యంగా ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చేందుకు టమాటా బాగా ఉపయోగపడుతుంది. చర్మానికి సంబంధించిన అనేక సమస్యలను టొమాటోతో ఉపశమనం కలిగించుకోవచ్చు. ముఖముపై పేరుకొనే ట్యాన్ తొలగించడం నుంచి జిడ్డును శుభ్రం చేయటం, మొటిమల వంటి సమస్యలకు టొమాటో ఒక న్యాచురల్ రెమెడీగా పని చేస్తుంది. చాలా మంది ఎక్కువగా సెన్సిటివ్ స్కిన్ కలిగి ఉంటారు. అలాంటి వారు మేకప్ వేసుకున్నా లేదా మార్కెట్లో లభించే కాస్మటిక్స్ వాడినా వారికి చర్మ సమస్యలను కలిగిస్తుంది.
అది వారి చర్మానికి పడక, చర్మం పై మంటను కలిగిస్తుంది.అలాంటి వారు టోమాటో గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే చాలా మేలు కలిగిస్తుంది. టొమాటోలో ఆక్జాలిక్ యాసిడ్,బీటా కెరోటిన్, లుటిన్, విటమిన్లు సి, ఇ వంటి అనేక యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మంపై కలిగే మంటను తగ్గించి,చల్లటి ప్రభావాన్ని కలిగిస్తుంది. టమాటోకి సహజంగా నిగారింపును అందంచే గుణం ఉంటుంది. ఆయిలీ స్కిన్ కలవారు టొమాటోను ముఖంపై రుద్దితే జిడ్డును తొలగిస్తుంది. టమాట గుజ్జు తీసి ముఖము పై బాగా రుద్ది ఐదు, పది నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత నీటితో కడిగేసుకోవాలి. దీంతో జిడ్డు పోవటమే కాకుండా మీ చర్మం శుభ్రంగా, తాజాగా కనిపిస్తుంది. కొద్దిగా గంధపు పొడినీ తీసుకొని అందులో నిమ్మరసం, టమోటా రసం కలపాలి.ఈ పేస్ట్‌ని ముఖం, మెడపై అప్లై చేసి 15 నిమిషాల పాటు బాగా మర్దన చేసి,ఆరాక చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేస్తే మీ చర్మం తెల్లగా,ముడుతలు తగ్గి చాలా అందంగా తయారవుతుంది. టొమాటోలోని యాసిడ్స్ చర్మంపై వచ్చే సన్ టాన్‌ను తొలగించి ప్రకాశవంతమైన ఛాయను అందించడంలో బాగా ఉపయోగపడుతుంది . సన్‌టాన్ వల్ల కలిగే నలుపుదనాన్ని వదిలించుకోవడానికి,2 టేబుల్ స్పూన్ల టమోటా గుజ్జులో, 1టేబుల్ స్ఫూన్ శనగపిండి,1 టేబుల్ స్పూన్ పెరుగు, కొన్ని చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మిశ్రమాన్ని మీ ముఖం, మెడపై బాగా మర్దన చేసి,దీన్ని 15-20 నిమిషాల వరకు ఉంచుకొని, ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇది టాన్‌ను తగ్గించడమే కాకుండా సూర్యుని UV కిరణాల వల్ల నిర్జీవంగా మారిన చర్మాన్ని కాంతివంతగా మారుస్తుంది. పైన చెప్పిన చిట్కాలన్నీ వాడి మీ ముఖాన్ని అందంగా మార్చుకోండి.