Beauty Tips : మన ముఖము అందంగా, తాజాగా ఉండాలని కోరుకుంటూ వుంటాము. కానీ ఇప్పుడున్న ఆహారపు అలవాట్లు, పొల్యూషన్ వల్ల ఎన్నో చర్మసమస్యలు వస్తుంటాయి. అవి పోగొట్టుకోవడానికి ఎన్నో రసాయనాలు కలిగిన ఉత్పత్తులు వాడుతుంటాము. కానీ అవి మనకు అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుంటాయి. అలా కాకుండా ఇంటి చిట్కాలను వాడితే మంచి ఫలితం లభించడమే కాకుండా, ఎలాంటి దుష్ప్రభావాలను కలిగించదు. ఇంటి చిట్కాలలో వాడే న్యాచురల్ ప్రోడక్ట్ లు ఎల్లప్పుడూ మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వాటిని వాడటం వల్ల ముఖము పై వచ్చే మచ్చలు,మొటిమలు లాంటి సమస్యలు పోగొట్టి, ముఖము అందంగా మెరిసిపోయేలా చేస్తాయి.అవేంటో ఇప్పుడు చూద్దాం..
తేనె : తేనె మన ముఖాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. బొప్పాయి మిశ్రమానికి తేనె జోడించిన పేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖము పై వచ్చే అనవసర జిడ్డును పోగొట్టి, చర్మాన్ని తాజాగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. పాలు : పాలు మన శరీరం ఆరోగ్యానికే కాక ముఖము మెరవడానికి కూడా ఉపయోగపడుతుంది.పాలు చర్మానికి క్లేన్సర్ లా పనిచేస్తుంది. పచ్చి పాలల్లో దూదిని ముంచి ముఖాన్ని రోజూ క్లీన్ చేసుకుంటే మృత కణాలు తొలగి, ముఖము కాంతివంతంగా కనిపిస్తుంది. పెరుగు : పెరుగులో యాంటీ ఏజింగ్ గుణాలున్నాయి. పెరుగును నిత్యం వాడుతూ ఉంటే చర్మంలోని డీహైడ్రేషన్, తేమను తొలగించి మచ్చలు లేకుండా యవ్వనంగా ఉంచుతుంది. పెరుగు, శనగ పిండి కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. ఇది ముఖము పై జిడ్డును తొలగించి, అందంగా తయారుచేస్తుంది.
పసుపు : పసుపు మీ చర్మ సంరక్షణకు చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల చర్మం మెరుస్తుంది.రోజూ పసుపు ముఖానికి రాయడం వల్ల ముఖము పై వచ్చే ఎలాంటి చర్మరోగాలనైనా పోగొడుతుంది. నిమ్మకాయ : నిమ్మ సహజ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది.వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరానికి కావాల్సిన కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. నిమ్మరసం మొటిమలపై రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అది మీ చర్మాన్ని సహజంగా కాంతివంతం చేయడానికి సహాయపడుతుంది. టమాటా : టమాటా.. మొటిమలు కలిగిన ముఖానికి వరం లాంటిది అని చెప్పొచ్చు. రోజూ టమాటో పై కొంచెం కాఫీ పొడి కానీ, షుగర్ కానీ వేసి ముఖానికి నెమ్మదిగా అప్లై చేయడం వల్ల వారంలోగా మొటిమలు, దాని తాలూకా మచ్చలు తొలిగిపోయి చర్మం తాజాగా తయారవుతుంది.