Beauty Tips : మెరిసే చర్మం పొందాలంటే ఇలా చేయండి..!!

Beauty Tips : ఇటీవల కాలంలో చాలా మంది సెల్ఫోన్ , లాప్టాప్ అంటూ ఎక్కువ సమయాన్ని వాటితోనే గడుపుతున్నారు. రాత్రి వరకు వీటితో సమయం గడపడం వల్ల నిద్రలేమి సమస్యతో పాటు చర్మం కాంతిని కూడా కోల్పోతుంది. ఉదయాన్నే లేచి కొన్ని చిట్కాలు కనుక పాటించినట్లయితే మెరిసే చర్మాన్ని మీరు కూడా పొందవచ్చు. ఇటీవల చాలామంది ఎదుర్కొంటున్న సమస్య నిద్రలేమి. అందుకు చాలా కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మొబైల్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఎక్కువగా ఉపయోగించడం వలన వాటి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు కూడా చర్మాన్ని పొడిబారేలా చేస్తాయి. అంతేకాదు చర్మంపై ముడతలు, సన్నటి గీతలు కూడా వస్తాయి.

ఉదయాన్నే కొన్ని అలవాట్లు చర్మానికి చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా తెల్లవారుజామున లేచిన వెంటనే కొన్ని రకాల చిట్కాలను పాటించినట్లైతే తప్పకుండా చర్మం యొక్క అందాన్ని పెంచుకోవచ్చు.. సాధారణంగా చాలా మందికి తెల్లవారు జామున లేవడం కష్టమైన పనిగా ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల ఇబ్బందిగా ఫీల్ అయినా.. కొన్ని పనులు మాత్రం ఆరోగ్యంగా అందంగా ఉంచుతాయని చాలా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఉదయాన్నే చేసే కొన్ని రోజువారీ కార్యకలాపాలు మన శారీరక ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయని వైద్యులు తెలుపుతున్నారు.ముఖ్యంగా మెరిసే చర్మం పొందాలంటే అందుకు తగ్గట్టుగా ఉదయపు అలవాట్లను కూడా ఫాలో అవ్వాలి.

Beauty Tips Do this to get shiny skin
Beauty Tips Do this to get shiny skin

నిద్ర లేవగానే ఒక గ్లాసు మంచి నీళ్లు తాగాలి ఇలా తాగడం వల్ల శరీరంలో అప్పటికే పేరుకుపోయిన టాక్సిన్లు బయటకు వెళ్లిపోయి సహజమైన మెరుపును పొందవచ్చు. ముడతలు మాత్రమే కాదు మృదువైన మచ్చలులేని మెరిసే చర్మం పొందాలంటే రోజుకు 4 లీటర్ల నీళ్లు కూడా తాగాలి. 30 నిమిషాలు వర్కవుట్ చేయడం, వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి, కండరాలు బలపడతాయి. ఇక చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. మెరిసే చర్మం పొందాలంటే ఇలాంటి చిట్కాలు పాటించడం తప్పనిసరి. మీలో ఎవరైనా సరే మెరిసే చర్మం కావాలని ఆలోచిస్తున్నట్లు అయితే వారికి ఆర్టికల్ వాట్సాప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.