Beauty Tips : చాలా మంది మడమలు పగుళ్ల తో బాధపడుతుంటారు. దీనికి కారణం శరీరంలోని భాగాలలో మిమహా ఇస్తే.. పాదాలకు మాత్రం నూనె గ్రంథులు ఉండవు. అందువల్ల పాదాలకు తగినంత నూనె ఊత్పత్తి కాక త్వరగా పొడిగా మారి, చీలి నొప్పీ కూడా కలిగిస్తుంటాయి. అంతే కాకుండా స్థూలకాయం, సరిపడని చెప్పులు ధరించడం, ఎక్కువ సేపు నిలబడడం, పొడి చర్మం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మడమ పగుళ్లు ఏర్పడతాయి.దీనికి మన వంటగదిలోని పదార్ధాలతో ఎన్నో రెమిడీస్ చేసుకోవడం వల్ల కాళ్ళ పగుళ్లను నివారించుకోవచ్చు.
అరటిపండు : అరటిపండులో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు పాదాలు పొడిబారకుండా తేమగా ఉంచడం లో సహాయపడతాయి. అరటిపండు గుజ్జుతో రోజూ మర్దన చేసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.
తేనె : తేనె న్యాచురల్ యాంటీ సెప్టిక్ ఏజెంట్‌గా పని చేస్తుంది. కనుక ఇది మడమ పగుళ్లను నయం చేయడంలో సహాయం చేస్తుంది. అదనంగా, ఇది మాయిశ్చరైజింగ్ లక్షణాల వల్ల చర్మం పొడిబారడాన్ని నివారిస్తుంది.తేనెను గోరు వెచ్చని నీళ్లతో కలిపి, అందులోనే పాదాలను అరగంట సేపు ఉంచి కడగాలి. ఇలా చేయడం వల్ల పాదాలు సున్నితంగా మారుతాయి.
కూరగాయల నూనె : కూరగాయల నూనెలోని విటమిన్ ఎ, విటమిన్ డి మరియు విటమిన్ ఇ వంటి పోషకాలు మృత కణాలను తొలగించి , కొత్త చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి మరియు పగిలిన మడమలను బాగు చేస్తాయి.
వాసెలిన్ మరియు నిమ్మరసం : నిమ్మకాయలో ఎసిటిక్ లక్షణాలు ఉన్నాయి. అలాగే మాయిశ్చరైజింగ్ గుణాలున్న వాసెలిన్‌తో కలిపి వాడితే పాదాలు పొడిబారకుండా, పగిలిన మడమలను త్వరగా నయం చేస్తుంది. గోరు వెచ్చని నీటిలో అర కప్పు నిమ్మకాయ రసం కలిపి అందులో అరగంట వరకు పాదాలను ఉంచి, ఆ తర్వాత బాగా శుభ్రం చేసుకొని మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాయడం వల్ల పగుళ్ళు తగ్గుతాయి.
బియ్యం పిండి, తేనె మరియు వెనిగర్ : బియ్యం పిండి సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. అంటే మృతకణాలను తొలగించి చర్మానికి పోషణనిస్తుంది. అలాగే కొంచెం తేనె కలుపుకుంటే మడమల పగుళ్లు నయం చేయడంలో సహాయపడతాయి.. మరియు కొద్దిగా వెనిగర్ కలుపుకోవడం వల్ల మృతకణాలు సులభంగా తొలగిపోయి, దాని స్థానంలో కొత్త చర్మం ఏర్పడేలా చేస్తుంది. వీటి మిశ్రమాన్ని పగుళ్ల కు అప్లై చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేసుకుంటూ ఉంటే మడమల పగుళ్ళు ఇట్టే తగ్గిపోతాయి.