Beauty Tips : నల్లటి మచ్చలను దూరం చేసే చక్కని చిట్కా..!!

Beauty Tips : జీవనశైలిలో మార్పుల కారణంగా చర్మ సమస్యలు కూడా అధికమవుతున్నాయి. అయితే ఇవి మనిషి యొక్క ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసేలా చేస్తున్నాయి. ఇటీవల కాలంలో చాలా మంది వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. చర్మం పై వచ్చిన డార్క్ స్పాట్ చికిత్స చేయడంపై దృష్టి సారించాలి. లేకపోతే ఇవి మరింత నల్లగా మారిపోయి.. చర్మాన్ని అందవిహీనంగా మార్చేస్తాయి. ముఖ్యంగా ముఖం పై వచ్చిన నల్లటి మచ్చలు ఎలా దూరం చేసుకోవాలి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.నల్లటి మచ్చలు రావడానికి గల కారణం ఏమిటంటే ఇంట్లో ఉపయోగించే లైట్స్ కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే కనిపించే కాంతి చర్మం యొక్క హైపర్ పిగ్మెంటేషన్ ను ప్రభావితం చేస్తుంది.

అలాంటి కాంతి ఎక్కువగా కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్, టీవీల ద్వారా వెలువడుతుంది. కాబట్టి దీనిని నివారించడానికి మీరు ప్రతిరోజు సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించడం తప్పనిసరి. ఇంట్లో ఉన్నా బయటకు వెళ్ళినా ఎప్పుడు కూడా ముఖానికి సన్ స్క్రీన్ లోషన్ రాయడం అసలు మర్చిపోవద్దు. ఇది చర్మానికి , కాంతికి మధ్య ప్రొటెక్షన్ లేయర్ గా పనిచేసి చర్మాన్ని కాపాడుతుంది.అంతే కాదు ఇంట్లో ఉన్నా లేదా బయటకు వెళ్ళినా సరే ప్రతి రెండు గంటలకు ఒకసారి చర్మాన్ని శుభ్రం చేసి.. సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించాలి . ఇలా చేయడం వల్ల సూర్యరశ్మి నుంచి వచ్చే అతి నీల లోహిత కిరణాల వల్ల చర్మానికి ఎటువంటి హాని కలగదు.

Beauty Tips A nice tip to avoid black spots
Beauty Tips A nice tip to avoid black spots

నిమ్మరసం చర్మం పై వచ్చిన నల్లమచ్చలను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. మీరు ఉపయోగించే ఫేస్ ప్యాక్ లలో కొద్దిగా నిమ్మరసం ను ఉపయోగించడం వల్ల చర్మం పై వచ్చిన నల్లటి మచ్చలు దూరం అవుతాయి. ఇక గర్భధారణ సమయంలో కూడా హార్మోన్ల మార్పుల వల్ల చర్మంపై నల్లటి మచ్చలు వస్తాయి. అదృష్టవశాత్తు , గర్భం దాల్చిన తర్వాత ఈ నల్ల మచ్చలు రావడం గమనించవచ్చు. మీకు తెలిసిన వారు ఎవరైనా ఇలాంటి నల్లటి మచ్చలతో బాధపడుతున్నట్లయితే వారికి ఈ ఆర్టికల్ ను వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసి అవగాహన కల్పించండి..