Beauty Tips : గోరింటాకు గురించీ, దాని ఉపయోగం గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. స్త్రీలు వారి చేతుల పాదాలకు అలంకరణ గా దీనిని పెట్టుకుంటూ ఉంటారు. అందుచేతనే పూర్వ కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ గోరింటాకు చెట్టు ఉండేది. గోరింటాకు పెట్టుకున్న చేతులు పాదాలు చూడటానికి చాలా అందంగా కనబడుతూ ఉంటాయి. అయితే ఎంతో మంది గోరింటాకు చేతులకు పెట్టుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ గోరింటాకు అనేది ఒక ఔషధంగా కూడా పనిచేస్తుంది. వాటి గురించి చూద్దాం. గోరింటాకు ఆకులను బాగా నూరి చేతులకు, కాళ్ళకు పెట్టుకోవడం వల్ల ఎటువంటి ప్రాణాపాయం ఉండదు..
కానీ ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఇలాంటివి చేయ లేకుండా అంగట్లో దొరికేటువంటి.. మెహందీ వంటివి ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇలాంటివి ఉపయోగించడం వల్ల చర్మం పైన దురద లు, దద్దుర్లు, చర్మ ఇన్ఫెక్షన్ వంటి రోగాలు వస్తున్నాయి. గోరింటాకు ఆకులే కాకుండా వాటి యొక్క బెరడు కూడా చాలా ఉపయోగపడుతుంది. గోరింటాకు చూర్ణాన్ని బాగా ఉపయోగించుకుంటే చర్మవ్యాధులను, మూత్ర రోగాలను నయం చేసుకోవచ్చు. మనకు ఏవైనా గాయాలు అయినప్పుడు గోరింటాకు , సబ్బును బాగా కలిపి నూరి ఆ గాయం తగిలిన చోట నూరిన పేస్టుని అప్లై చేయడం వల్ల వచ్చే వాపులు, నొప్పులు తగ్గిపోతాయి.
గోరింటాకు బాగా నూరుకొని పట్టించుకోవడం వల్ల చేతులు , కాళ్లు పగుళ్లు వంటివి జరగవు. ముఖ్యంగా మన శరీరానికి చాలా చల్లదనాన్ని కూడా అందిస్తుంది అని నిపుణులు తెలియజేస్తున్నారు. గోరింటాకును బాగా నోరు ఏవైనా చర్మ గడ్డలపైన ఉంచితే అవి తగ్గి పోతాయి అట. ఎవరికైనా అరికాళ్ళలో ని మంటలు తగ్గిపోవడానికి ఈ గోరింటాకు రాస్తే చాలు. ఒక గ్లాసు నీటిని తీసుకొని అందులో కి నల్లపూస, ముల్ల గోరింటాకు రసాన్ని వేసుకుని కలుపుకుని కషాయం మాదిరి తాగితే నోటిలో ఉండే పూత, దంతాలు చాలా గట్టిపడతాయి అట. ఎలాంటి మొండి చర్మ రోగాలను సైతం నయం చేయడానికి గోరింటాకు చాలా సహాయపడుతుందట. అంతేకాదు శరీరంలో ఉండే వస్తాన్ని బయటికి పంపించడంలో గోరింటాకు సహాయపడుతుంది.