Beauty Benefits : ఈ చెట్టు ఆకులతో అందంతో పాటు కేశ సంపద కూడా సొంతం..!

Beauty Benefits : నిత్యం మనకు మర్రిచెట్టు ఎక్కడో ఒకచోట తారసపడుతూనే ఉంటుంది.. ఇక పల్లెటూర్లో అయితే మరి చెట్లు విరివిగా కనిపిస్తుంటాయి.. మర్రిచెట్టు మొత్తం ఔషధాల గని.. అటువంటి మర్రి చెట్టు వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని అందరికీ తెలిసిందే.. అందానికి, చర్మ సంరక్షణను పెంపొందించడం తోపాటు కేశాలకు కూడా ఈ చెట్టు ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

లేత మర్రి ఆకులను ఆరు తీసుకొని అందులో పది గ్రాముల ఎర్ర కందిపప్పు ను కూడా కలపలి. ఈ రెండింటిని నీటితో కలిపి మెత్తగా ముద్దగా నూరుకోవాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. ముఖానికి అప్లై చేసినా పది నిమిషాలపాటు అలాగే ఉంచి ఆ తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది.

Beauty and hair benefits of banyan tree Leaves
Beauty and hair benefits of banyan tree Leaves

మర్రి ఆకులను తీసుకొని మెత్తగా నూరి దాన్ని నుంచి రసం తీసుకోవాలి. ఆవాల నూనె లో మర్రి ఆకుల రసాన్ని పోసి సన్నని మంటపై నూనె మాత్రమే మిగిలే వరకూ మరిగించాలి. బాగా మరిగిన తరువాత ఆ నూనె ను వడపోసుకునీ ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనె ను ఈ రోజు జుట్టు కుదుళ్ళకు రాసుకుని మర్దన చేసుకుంటూ ఉండాలి. కనీసం వారంలో రెండు సార్లయినా ఈ నూనె రాసుకుంటే జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు సమస్య తగ్గుతుంది. శిరోజాలు ధృడంగా, ఒత్తుగా పెరుగుతాయి. కొత్త వెంట్రుకలు మొలుస్తాయి.