Diabetes : మీరు మధుమేహంతో బాధపడుతున్నారా..!అయితే గుర్మారాకు తో ఇలా చేసి చూడండి..

Diabetes : ఈ మధ్య కాలంలో మధుమేహం అనేది సర్వ సాధారణ జబ్బుగా మారింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ వారి ప్రకారం 750కోట్ల జనాభా లో 46 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని తేల్చింది.ఒక్కసారి శరీరం లో మధుమేహం ఆవహిస్తే అది మిమ్మల్ని జీవితాంతం పట్టిపీడిస్తూనే ఉంటుంది. అంతేకాకుండా దీనికి ఎలాంటి ఔషధాలు కూడా కనుగొనలేదు. ఆరోగ్యానికి హాని చేసే ఆహారాలను తీసుకోవడం వల్ల చాలామందిలో ఈ సమస్య ప్రాణాంతకంగానూ మారుతుంది. అంతే కాకుండా కొంతమంది వారు తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లో ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటున్నారు. అది రక్తంలో షుగర్ లెవెల్స్ పెంచి చివరికి ప్రాణాలు హరించే సమస్యలగా మారుతుంది.

భారత్లో ప్రస్తుతం సాంప్రదాయ వంటల్లోకి విదేశీ పోకడలు వచ్చి రకాల అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటున్నారు. దీని వల్లే మధుమేహానికి గురవుతున్నారు. అయితే ఈ ప్రాణంతక సమస్య నుంచి బయట పడాలంటే తప్పకుండా ఆహార విషయం లో పలు నియమాలు పాటించాలి. అదే విధంగా ఆయుర్వేద చికిత్స లో మధుమేహానికి మంచి చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ఆయుర్వేద నిపుణులు గుర్మారాకు వల్ల రక్తంలో చక్కెర పరిమాణం కేవలం 1 గంటలో తగ్గుతుందనీ పరిశోధించి మరీ నిరూపించారు. గుర్మార్ ఆకులను మధుమేహానికి ఓ గొప్ప ఔషధంగా ఆయుర్వేద నిపుణులు పేర్కొంటారు.ఇది శరీరానికి అవసరమైన విటమిన్లు మరియు ఇతర పోషకాలను పుష్కళంగా అందిస్తుంది. అంతేకాకుండా గుర్మారాకు లో శరీరంలోని రక్తంలో షుగర్ లెవెల్స్ నీ క్రమంబద్దికరించే చాలా రకాల మూలకాలు ఉన్నాయి.

Are you suffering from diabetes
Are you suffering from diabetes

ఆయుర్వేద చికిత్స లో భాగంగా క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలోనీ షుగర్ లెవెల్స్ తొందరగా క్రమబద్దీకరించబడతాయి. ముఖ్యంగా ఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్ల ఎక్కువగా ఉంటాయి . ఇది ముఖ్యంగా శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వులను సులభంగా తగ్గిస్తుంది. కనుక మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా ఈ ఆకులను తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.ఆ ఆకులను ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం.. గుర్మారాకు ను బాగా దంచి రసం తీసి ఇందులో కొంచెం బెల్లం కలిపి తీసుకోవాలి. ఈ రసం కొంచెం చేదుగా ఉంటుంది. కాబట్టి ఐరన్ లభించే బెల్లం కలిపి తీసుకోవాలి. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వల్ల రక్తంలోని గ్లూకోస్ లెవెల్స్ అదుపులో ఉంచుతుంది . అయితే ఈ ఆకులకు యాలకులు కలుపుకొని తినడం వల్ల కూడా మధుమేహం తొందరగా అదుపులోకి వస్తుంది. అంతే కాకుండా ఇందులో పీచు పదార్థము అధికంగా ఉండటం వల్ల జీర్ణ క్రియ సమస్యలు తొలగిపోతాయి