BALD:చిన్న వయసులోని బట్టతల వచ్చేసిందా? అయితే ఇలా చేయండి..!

తీసుకునే ఆహారంలో పోషకాలలోపం.. జీవనశైలిలో మార్పులు.. అనారోగ్యకరమైన అలవాట్లు.. దుమ్ము, దూళి , కాలుష్యం , ఎండ ఇలా పలు కారణాలవల్ల చాలామంది చిన్న వయసులోనే అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇక అలాంటి వాటిలో జుట్టు రాలిపోయే సమస్య కూడా ఒకటి. ఈమధ్య కాలంలో మరీ చిన్నపిల్లలకే బట్టతల రావడం లేదా జుట్టు తెల్లబడిపోవడం, అధికంగా జుట్టు రాలడం వంటి సమస్యలు ఎక్కువగా మనం చూడవచ్చు. అయితే ఇలా చిన్న వయసులోనే బట్టతల వచ్చేస్తుంది అంటే అందుకు అనారోగ్య సమస్యలు కూడా కారణమని చెప్పాలి. బట్టతల వచ్చి మీ అందాన్ని పాడు చేస్తుంటే కొన్ని రకాల ఇంటి చిట్కాలను పాటించి మీ అందాన్ని తిరిగి పెంపొందించుకోవచ్చు.

నిజానికి మగవారికి బట్టతల వస్తే చికిత్స లేదు అని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జుట్టును పెంచుకునే అవకాశం ఉందని ప్రముఖ సౌందర్య నిపుణులు తెలియజేస్తున్నారు.. కాలంలో బట్టతల అనే సమస్య ఎక్కువగా మగవారిలోనే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా చర్మవ్యాధి నిపుణులు తెలియజేస్తున్న సమాచారం ప్రకారం సమతుల్య ఆహారం సమయోచిత మినోక్సిడిల్ మందులు వాడితే బట్టతల సమస్యను అధిగమించవచ్చు. ఇక జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఒత్తిడి కూడా ఒకటి అని గమనించాలి . సాధ్యమైనంత వరకు ఏ విషయాలను ఎక్కువసేపు ఆలోచించడం మంచిది కాదు.

బట్టతల రావడానికి డైహైడ్రోటెస్టోస్టెరాన్, డిహెచ్డి హార్మోన్ల వల్ల వస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. దీనివల్ల జుట్టు కుదుళ్లు కుషించుకుపోతాయి. సన్నగా పెరుగుతుంది సులభంగా రాలిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయని చర్మవ్యాధి నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రోటీన్, ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా బలంగా పెరుగుతుందని స్పష్టం చేశారు. ఇక జుట్టును పెంచే ఆహారాల విషయానికొస్తే చేపలు పెరుగు గుడ్లు, గుడ్డు మాంసం చికెన్ వంటి వాటిల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది వీటిని తినడం వల్ల మీ జుట్టు కుదురులను బలంగా తయారు చేసుకోవచ్చు.

ఇక అంతేకాదు ప్రోటీన్ లో ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలకు సంబంధించిన కణాలకు కావలసిన ఆక్సిజన్ ను తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఇక సాధ్యమైనంతవరకు ఒత్తిడిని తగ్గించుకొని సరైన ఆరోగ్య ఆహారపు అలవాట్లను చేర్చుకున్నట్లైతే తప్పకుండా బట్టతల నుంచి బయటపడవచ్చు జుట్టు రాలే సమస్యలు కూడా దూరం అవుతాయి.