Diabetes Control Tips : 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి శరీర మార్పులు, ఒత్తిడి, వంటివి తోడై చాలా శారీరక సమస్యలను వస్తూ వుంటాయి. వీటి పట్ల కొంతమంది అజాగ్రత్త పాటిస్తుంటారు.వీటిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మొదటికే మోసం వస్తుంది.ఆరోగ్యమే మహాభాగ్యం అని వూరికే అంటారా. ఆరోగ్యం బాగా ఉంటేనే ఏదయినా సాధించగలం. కొన్ని సమస్యలుకు సంబదించిన లక్షణాలు కనిపిస్తూనే వైద్యనిపుణులను సంప్రదించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. బరువు పెరగడం లేదా తగ్గడం..40 ఏళ్ల వయసు దాటిన వారు ఒక్కోసారి సడన్ గా బరువు పెరగడంకాని, తగ్గడం కానీ అవుతుంటారు.ఇవి రెండూ సమస్యతో కూడుకున్నవే అని గమనించగలరు. మధుమేహ సమస్య మొదలైన వారు సడన్ గా బరువు తగ్గుతారు. అలాగే కొలెస్ట్రాల్ అధికమై తెలీయకుండానే బరువు పెరుగుతుంటారు. కాబట్టి ఇలాంటి లక్షణాలు గమనించి వైద్యుని సలహా తీసుకోవాలి.
ముసలితనం అనేది ఒక సాధారణ విషయం. దాన్ని ఆపడానికి ఎవరికి సాధ్యం కాదు . 30 సంవత్సరాల వయస్సులో శరీరం యూత్ గా ఉండి బలంగా కూడా ఉంటారు. కానీ 40 సంవత్సరాల నిండగానే శరీరంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి.ఇలాంటి లక్షణాలు 40 ఏళ్లు వయస్సు దాటిన మగవారిలో కనిపిస్తే అజాగ్రత్త చేయకూడదు. గుండెల్లో మంట..గుండెల్లో మంట అనిపిస్తే ఏ మాత్రం అశ్రద్ధ చేయొద్దు.. కొన్నిసార్లు సరిగ్గా సమయానికి తినక, ఆసిడిటి లేదా డైజేషన్ ప్రాబ్లమ్స్ కారణంగా గుండెల్లో మంట వస్తుంది . అయితే ఇది మాటిమాటికి వస్తే.. వెంటనే వైద్యనిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. గుండె జబ్బులు మొదటి దశలో ఉన్నా కూడా.. గుండెల్లో మంట వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. తరచుగా తలనొప్పి..ఇక తరుచుగా తలనొప్పి వస్తే కచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిందే.
తరచుగా తలనొప్పి సమస్య ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ పార్శ్వపు నొప్పీ ఎక్కువగా వస్తుంటాయి. అతి మూత్ర విసర్జన..మాటి మాటికీ మూత్ర విసర్జన కు వెళ్తూ ఉంటే అయితే ఆలోచించాల్సిన విషయమే.ఇది చాలా ప్రమాదకరమని గుర్తించి వెంటనే వైద్యుని సంప్రదించాలి . ఒక సాధారణ వ్యక్తి రోజుకు 3 లీటర్లకు మించి మూత్ర విసర్జన చేస్తువుంటే పాలీ యూరియా అనే వ్యాధితో ఇబ్బంది పడుతున్నారని అర్థం. వెన్నునొప్పి, కిళ్ళ నొప్పులు ..కొంతమంది కి వయసు పెరిగేకొలది క్యాల్షియం తగ్గి ఎముకలు దెబ్బతింటాయి వెన్ను నొప్పి, కీళ్ళనొప్పులు కూడా వస్తూ వుంటాయి.మీకు మెడ నుండి నడుము వరకు భరించలేని నొప్పి ఉంటే, మీ వెన్నెముక ఎముకలు బలహీనంగా ఉన్నట్లే. వెన్నుముక శరీరంలో ముఖ్యమైన భాగం. అశ్రద్ధ వహించకండి.. వెన్నునొప్పి మొదలైతే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.