Useless Food : ఎక్స్పైరీ అయిన ఫుడ్ ఏం కాదులే అని తింటుంన్నారా.. తస్మాత్ జాగ్రత్త..! 

Useless Food : ఇప్పుడున్న ఆహార అలవాటులో భాగంగా ప్యాక్ చేసిన ఫుడ్డు ను తింటూ ఉంటాము. ఇప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలైనా పాలితిన్ బ్యాగులలో ప్యాక్ చేసి.. అవి ఈ సమయంలో ప్యాక్ చేసారు, ఎంత వరకు ఆ ప్యాకెట్ ను వాడొచ్చు అని వాటిపై ప్రింట్ చేస్తారు. ఒక వేల దానిపై ప్రింట్ చేసిన డేట్ తర్వాత అవి ఎవరు వాటిని వాడకుండా.. ఎక్స్పైరీ డేట్ తర్వాత అవి క్రమంగా చెడి పోతాయి. కానీ కొంతమంది ఆ ఎక్స్పైరీ డేట్ చూడకుండా కొనేస్తూ వుంటారు. కొన్న తర్వాత చూసినా.. డబ్బులు వేస్ట్ అవుతాయి కదా అని తింటూ వుంటారు. కానీ కోనేముందు అ ప్యాక్ పై వున్న ఎక్స్పైరి డేట్ చూసి కాల పరిమితి ఎంత వరకు ఉన్నదో చెక్ చేసిన తర్వాతే ఆహార పదార్థాలు, పానీయాలు కొనడం వంటివి చేయాలి.

Advertisement
Useless Food : Are you eating expired food? Be careful
Useless Food : Are you eating expired food? Be careful

ప్యాక్ చేసిన, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కావున తేదీ మించిన వాటిని తినడం ఆరోగ్యానికి ఎంతో చెడు చేస్తుందని అని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. కేవలం ఆహార పదార్థాలకే కాక జబ్బులు తగ్గించుకోవడానికి వేసుకునే మందుల విషయంలో కూడా తుది గడువును జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవాలి. ముఖ్యంగా చిన్న పిల్లలకు వేసే మెడిసిన్ కచ్చితంగా చెక్ చేసి తీసుకోవాలి. దీని విషయంలో అజాగ్రత్త పాటిస్తే కొన్ని సార్లు అవి ప్రాణంతకం కావొచ్చు.

Advertisement

ఎక్స్పైరీ డేట్ ముగిసిన ఆహారాన్ని తింటే పుడ్ పాయిజన్ జరిగే అవకాశం వుంది. దీని వల్ల వీరేచనాలు, వాంతులు అయి ప్రాణాల మీదికి కూడా రావొచ్చు.ముఖ్యంగా పచ్చిగా ఉన్నవన్నీ తొందరగా పాడవుతాయి. అందులో భాగంగా గుడ్లు, మాంసం, కూరగాయలు వంటివి తొందరగా పాడావుతాయి. కాబట్టి వీలైనంత ప్రెష్ గా తినాలి.

ప్యాక్ చేసిన పదార్థాలు ఎక్స్పైరి తేది ముద్రించే వస్తాయి. అటువంటి వాటిని కచ్చితంగా ఆ గడువు తేదీ లోపే తినడం చాలా ప్రయోజనకరం. లేదంటే వాటిలో బ్యాక్టీరియాలు చేరి పాయిజన్ గా మారుతాయి.బ్రెడ్ మరియు పాల పదార్థాలను గడువులోగ వాడక పొతే,వాటిపై ఫంగస్ చేరి విషంగా మారుతాయి. అలాంటి ఫుడ్ తెలియక తీసుకున్నా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవచ్చు. కాబట్టి ఈ సారి మీరు ఏదయినా కొనబోయే ముందు ఎక్స్పైరి డేట్ చెక్ చేసి మరీ తీసుకోవడం చాలా ఆరోగ్యకరం.

Advertisement