BEAUTY Tips : అమ్మాయి ముఖం తెల్లగా.. అందంగా .. చూడముచ్చటగా ఉన్నప్పటికీ.. ముఖం మీద అక్కడక్కడా కనిపించే నల్లటి మచ్చల వల్ల ఆ అమ్మాయి అందం మొత్తం చెడిపోతుంది. అందుకే ముందుగా అమ్మాయిలు తెల్లగా అవ్వడానికి కంటే ముందు ముఖం మీద ఉండే మచ్చలు తొలగించుకోవాలని ఆసక్తి చూపిస్తుంటారు. ఇక నల్లటి మచ్చలు లేని ముఖం ఎలా ఉన్నా సరే చాలా అందంగా కనిపిస్తుంది. మచ్చల వల్ల ముఖంలో కాంతి కోల్పోయి ముఖం కూడా అందవికారంగా కనిపిస్తుంది.ఈ నల్ల మచ్చలు రావడానికి గల కారణం ఏమిటంటే.. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారు లేదా బయట సూర్యరశ్మి ప్రభావానికి ఎక్కువగా గురవుతున్న వారికి ఈ మచ్చలు అనేవి రావడం సహజం.
కొంతమందికి మొటిమలు వచ్చి .. తగ్గిపోయిన తర్వాత కూడా అదే ప్రదేశంలో నల్లగా మచ్చగా ఏర్పడుతుంది.. వయసు పైబడుతున్న కొద్ది కూడా ముఖం మీద నల్ల మచ్చలు రావడం సహజం. ఈ మచ్చల వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.. కానీ అందవికారంగా కనిపిస్తాము. అమ్మాయి అందంగా ఉంటేనే తన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అని ఎంతో మంది సైకాలజిస్టులు కూడా తెలిపారు.ఈ నల్ల మచ్చలు దూరం చేసుకోవడానికి ఇప్పుడు మనం ఏం చేయాలో ఒకసారి చదివి తెలుసుకుందాం.. వంటింట్లో దొరికే నెయ్యి.. నెయ్యి చర్మపు పొరల లోకి చొచ్చుకు పోయి చర్మం నిగనిగలాడేలా చేస్తుంది. అంతేకాదు చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను కూడా తొలగించి చర్మం ఉత్తేజ పరచడానికి చాలా బాగా పనిచేస్తుంది.

నెయ్యిలో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఈ తో పాటు విటమిన్ కే కూడా సమృద్ధిగా లభిస్తాయి. వీటి వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండడంతోపాటు చర్మానికి అవసరమైన పోషకాలు కూడా లభిస్తాయి.అందుకే దీన్ని క్రమం తప్పకుండా ముఖానికి రాయడం వల్ల చర్మం మీద ఉండే నల్ల మచ్చలు కూడా క్రమంగా తగ్గిపోతాయి. కేవలం నల్ల మచ్చలకు మాత్రమే కాదు చర్మం పొడిబారి పోయినట్టు, పెదవులు ఎండిపోయినట్లుగా మీకు అనిపిస్తే వెంటనే నెయ్యి రాసి ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు.