Beauty Tips : చాలా మందికి చర్మ సమస్యలు, డీ హైడ్రెషన్, పొల్యూషన్ వల్ల నల్ల మచ్చలు, నల్లటి వలయాలు ఏర్పడుతాయి. వీటిని తగ్గించడానికి చాలా అవస్థలు పడుతుంటారు. చాలా క్రిములు, లోషన్స్ వాడుతుంటారు. కానీ ఫలితం లేక ఆందోళన చెందుతుంటారు. అలాంటి వారు ఎక్కడికైనా వెళ్లాలన్నా మొహమాటపడుతుంటారు. అలాంటి వారు వాటిని శాశ్వతంగా పోగొట్టలేకపోయినా మేకప్ తో కవర్ చేసుకోవచ్చు. ముఖము అందంగా కనపడాలి అంటే కన్సీలర్ బాగా ఉపయోగపడుతుంది. నల్ల మచ్చలను, నల్లటి వలయాలను కనబడకుండా కవర్ చేస్తుంది. సాధారణంగా కన్సీలర్‌లో చాలా రకాలు ఉన్నాయి.కానీ చర్మ రంగు, చర్మతత్త్వం బట్టి కన్సీలర్ ఎంచుకుంటే అందంగా కనిపిస్తారు.
ఎవరికైనా.. ఎంచుకోవాల్సిన కన్సీలర్ రంగు చాలా ప్రధానమైనది.ఆ కన్సీలర్ రంగు మరీ లేత రంగు లేదా మరీ ముదురు రంగులో ఉండకూడదు. ఎందుకంటే అవి నల్ల మచ్చలను కవర్ చేయడంలో ఉపయోగపడవు. కన్సిలర్ ఎంచుకొనేటప్పుడు మన చర్మరంగు కన్నా కొంచెం డార్క్ కలర్ కన్సీలర్ ఎంచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే అది డార్క్ స్పాట్‌లను బాగా కవర్
చేస్తుంది. కన్సీలర్ ఎంపిక చేసుకునేటప్పుడు ముఖంపై ఉన్న నల్లటి మచ్చలపై ఆధారపడి ఉండాలి. బ్రౌన్ డార్క్ సర్కిల్స్ ఉంటే, పసుపు రంగును ఉపయోగించాలి.లేదా రక్త ప్రసరణ కారణంగా బ్లూ కలర్ వృత్తాలు ఉంటే, నారింజ లేదా గులాబీ రంగును వాడాలి. కన్సిలర్ స్టిక్ మరియు పెన్సిల్ రెండూ డార్క్ స్పాట్‌లను దాచడంలో చాలా సహాయపడతాయి. మీరు నల్ల మచ్చలపై నేరుగా ఉపయోగించవచ్చు.
ముఖంపై ఎక్కువగా వున్న డార్క్ స్పాట్స్ నీ కవర్ చేయడానికి క్రీమ్‌లు బాగా ఉపయోగపడతాయి. కన్సీలర్‌లతో మచ్చలను పూర్తిగా కవర్ చేసి మరియు ముఖం యొక్క అంచులను పూర్తిగా కవర్ చేస్తేనే,అది సహజంగా కనిపిస్తుంది. మీ కళ్ల చుట్టూ ఉన్న నల్లటి వలయాలను మరియు నల్లటి మచ్చలను కవర్ చేయడానికి లిక్విడ్ కన్సిలర్ లు బాగా ఉపయోగపడతాయి.ఇది అప్లై చేసినా తర్వాత కొంత సేపు అరనివ్వాలి. పూర్తిగా ఆరిన తర్వాత మీ మేకప్ వేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. కొనుగోలు చేసే కన్సీలర్‌పై ఆధారపడి .. మేకప్ కిట్ సెలెక్ట్ చేసుకోవాలి.లిక్విడ్ మరియు క్రీమ్ కన్సీలర్‌లను ఎంపిక చేసుకున్నప్పుడు, ఫౌండేషన్ వేసుకున్న తర్వాత మరియు పాష్ పౌడర్‌కు అప్లై చేయక మునుపే కన్సిలర్ తో డార్క్ స్పాట్స్ నీ, డార్క్ సర్కిల్ నీ కవర్ చేసుకోవాలి.మన బాడీ, పేస్ తగ్గట్టు మేకప్ చేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు. మరియి చర్మం తాజాగా ఉండడానికి నీరు ఎక్కువుగా తీసుకుంటూ ఉండాలి.