Dark Skin : డార్క్ స్కిన్ ను దూరం చేసే అద్భుతమైన చిట్కా..!!

Dark Skin : ప్రతి ఒక్కరూ చర్మం అందంగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే చర్మ సంరక్షణ విషయంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సి కూడా ఉంటుంది. ముఖ్యంగా చర్మ సంరక్షణ కోసం చేసే ప్రతి పనిలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఒక్కొక్కసారి సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం ఇంట్లోనే కొన్ని పనుల ద్వారా మన చర్మాన్ని అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. ముందుగా తినే ఆహారంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి . ఫుడ్ ఫాస్ట్ , జంక్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉంటేనే చర్మం పై చెడు ప్రభావం చూపించకుండా ఉంటాయి. ఇక వేసవి కాలంలో చర్మం అధికంగా నిర్జీవంగా మారడం , మచ్చలు, మొటిమలు, ముడతలు రావడం వంటి సమస్యలు అధికమవుతాయి. అలాంటప్పుడు చర్మ సంరక్షణలో వంటింటి చిట్కాలు ఏవిధంగా ఉపయోగపడతాయో ఒకసారి చదివి తెలుసుకుందాం..

కొత్తిమీర – నిమ్మకాయ : కొత్తిమీర ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తుందో.. నిమ్మకాయ కూడా అన్నే ప్రయోజనాలను అందిస్తుంది. కానీ ఈ రెండింటి కాంబినేషన్ వల్ల చర్మ సౌందర్యాన్ని మరింత పెంచుకోవచ్చు. ఇందుకోసం తాజాగా ఉండే కొత్తిమీరను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి జ్యూస్ బయటికి తీయాలి. అందులో నిమ్మరసం వేసి తాగడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ జ్యూస్ యాంటీఆక్సిడెంట్లతో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో పాటు విటమిన్ సి కలిగి ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన ఫ్రీరాడికల్స్ తో పోరాడే శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.

Amazing Tip To Get Rid Of Dark Skin
Amazing Tip To Get Rid Of Dark Skin

ముఖ్యంగా అకాల వృద్ధాప్యాన్ని కూడా నివారించవచ్చు. మొటిమలు , ముడతలు దూరం చేయడమే కాకుండా నల్లటి మచ్చలు కూడా దూరమవుతాయి.. ఈ జ్యూస్ ను ముఖానికి అప్లై చేయవచ్చు లేదా శరీరంలోకి తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ జ్యూస్ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. చర్మం అందంగా మారడమే కాకుండా రంగును సంతరించుకొంటుంది.. ఇక మచ్చలు , మొటిమలు, ముడతలు అన్ని దూరం అవుతాయి. చర్మం యవ్వనంగా తయారవుతుంది. ఇక మీ ఇంట్లో అక్క, చెల్లి, అమ్మ, అత్త , వదిన ఇలా ఎవరైనా సరే చర్మ సంబంధ సమస్యలతో బాధపడుతున్నట్లైతే వారికి ఈ ఆర్టికల్ వాట్సప్ లేదా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి.