Beauty Tips : డల్ స్కిన్ ను దూరం చేసే అద్భుతమైన హోమ్ రెమెడీస్..!!

Beauty Tips : కరోనా వచ్చిన తర్వాత ఉద్యోగాలు చేసే ఆడవారు వర్క్ ఫ్రం హోం పేరిట ఇంటి నుంచి ఉద్యోగం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా చాలామంది ఎండలో తిరగడం వల్ల మనకు డల్ స్కిన్ వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇంట్లో కూర్చొని అసాధారణ జీవనశైలి వల్ల కూడా చర్మం నిర్జీవంగా మారిపోతుంది. మన లైఫ్ స్టైల్ లో మార్పులు రావడం, ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం , లాప్ టాప్, సెల్ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల నుండి వెలువడే రేడియో తరంగాలు ముఖాన్ని ఎక్కువగా డల్ గా మార్చేస్తాయి. చర్మం నిర్జీవంగా మారి పోవడం.. పొడిబారిపోవడం.. రంగు మారిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

అంతే కాదు శరీరం డీహైడ్రేషన్ కు గురికావడం, బిజీ లైఫ్ స్టైల్ వల్ల ముఖంపై మృతకణాలు కూడా పేరుకు పోతాయి. అయితే ఈ డల్ స్కిన్ ను తొలగించాలి అంటే కొన్ని రకాల చిట్కాలను మీరు పాటించాల్సి ఉంటుంది.చర్మం తేజోవంతంగా లేకపోవడానికి గల కారణం ఏమిటి అంటే..డీహైడ్రేషన్ ,పొడిబారిన చర్మం , మాయిశ్చరైజర్ లేకపోవడం, మద్యం, ధూమపానం, కారణాల వల్ల కూడా మీ చర్మం డల్ గా మారే అవకాశాలు ఉంటాయి. ఇంటి చిట్కాలు పాటించాలి అంటే ముందుగా నిమ్మకాయ ఒక మంచి మెడిసిన్ అని చెప్పవచ్చు. నిమ్మకాయలో విటమిన్ సి ఉండడం వల్ల చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.

Amazing Home Remedies To Get Rid Of Dull Skin
Amazing Home Remedies To Get Rid Of Dull Skin

బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ట్యాన్ ను పోగొట్టి.. చర్మాన్ని ఎక్స్ ఫోలియెట్ చేయడంలో చాలా చక్కగా పనిచేస్తుంది.ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల చక్కెర, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ముఖానికి అప్లై చేసి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. రెండుసార్లు మీరు ఈ చిట్కా పాటించినట్లయితే నిర్జీవంగా మారిన మీ చర్మం కాంతివంతంగా తయారవుతుంది. నిమ్మకాయ కు బదులు తేనె , కలబంద, పెరుగు, కీరారసం వంటివాటిని అప్లై చేయడం వల్ల కూడా మంచి ఫలితాలను పొందవచ్చు.