Dark Circles : ఈమధ్య కాలంలో చాలా మందికి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేవి కామన్ అయిపోయాయి. ముఖ్యంగా ఎక్కువ సేపు చదువుకోవడం లేదా ఎక్కువసేపు మేల్కోవడం లేదా ఎక్కువసేపు లాప్టాప్ , టీవీ, సెల్ ఫోన్ వంటివి వినియోగించడం వల్ల నిద్ర తక్కువ అయిన సందర్భాలలో కూడా ఇలా కళ్ళ కింద నల్లటి వలయాలు వస్తూ ఉంటాయి. ఇక వీటివల్ల అంద విహీనంగా మారిపోతూ ఉంటారు. అందుచేతనే వీటిని ఎలా పోగొట్టుకోవాలా అని కొంతమంది పురుషులు,మహిళలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వుంటారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా డార్క్ సర్కిల్స్ అనేవి పోకపోతే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే అలాంటి వారికి ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు నల్లటి వలయాలు దూరం చేసుకోవచ్చు.
1). కళ్ళ కింద నల్లటి వలయాలను దూరం చేయడానికి కొబ్బరి నూనె బాగా ఉపయోగపడుతుందట. ఈ నూనెను తీసుకొని కళ్ళకింద కాసేపు మసాజ్ చేసినట్లు పట్టిస్తే వీటి నుంచి తప్పించుకోవచ్చు.
2). ఇక మరొక పద్ధతి ఏమిటంటే టమోటా జ్యూస్ , నిమ్మరసం వల్ల ఈ డార్క్ సర్కిల్స్ ను నివారించవచ్చు.. టమోటా జ్యూస్ లోకి కాస్త నిమ్మరసం వేసి.. ఆ బ్లాక్ సర్కిల్స్ కింద ఒక 5 నిమిషాల పాటు మనం మసాజ్ చేసినట్లయితే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు.
3). ఇక మరొక పద్ధతి ఏమిటంటే బంగాళదుంపలను బాగా ఉడికించి.. వాటిని పేస్టులాగా చేసి, వాటిని చిన్న చిన్న బిళ్ళలుగా చేసి కళ్ళకింద ఉంచడం వల్ల ఈ వలయాలు మటుమాయమవుతాయి.
4). కీరదోసను పైన ఉండే తొక్క తీసేసి బాగా చిన్న చిన్న ముక్కలుగా కోసి.. వాటిని కళ్ల మీద పెట్టుకుంటే డార్క్ సర్కిల్స్ తగ్గే అవకాశం ఉంటుంది.. ఒకవేళ కీరదోసకాయను బాగా పేస్టులాగా నూరి అందులో కి కాస్త నిమ్మరసం వేసి కళ్ళకింద పూసినట్లు అయితే ఈ వలయాలను దూరం చేసుకోవచ్చు.
5). ఇక చివరిగా డార్క్ సర్కిల్స్ తొలగిపోవాలంటే చాక్లెట్స్ తిన్నాకూడా ఈ వలయాల నుంచి విముక్తి పొందవచ్చు.. అని కొంతమంది నిపుణులు తెలియజేయడం జరుగుతుంది.
ముఖ్యంగా ఎక్కువ సేపు నిద్ర పోవడం మంచిది, ప్రతి విషయానికి టెన్షన్ పడకుండా నెమ్మదిగా ఆలోచిస్తే ఇలాంటి వలయాలు రావు. డార్క్ సర్కిల్స్ రాకుండా కాపాడుకోవచ్చు.