Health Benefits : చింతపండు ఉపయోగాలు తెలిస్తే .. పుల్లగా ఉంది అని కంప్లయింట్ కూడా చేయరు !

Health Benefits : చాలా మంది ప్రతిరోజూ వంటకాల్లో చింతపండును వాడుతుంటారు. కొంత మంది తక్కువగా వాడినా కూడా, మరికొంత మంది మాత్రం ప్రతిరోజూ చింతపండుతో ఏదో ఒక వంటకం చేస్తుంటారు. పచ్చి పులుసు దగ్గర నుండి పలు రకాల కూరల వరకు వాడుతుంటారు. కానీ చింత‌పండుతో ఎన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయో చాల త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు. ఆరోగ్య శాస్త్ర నిపుణులు చెబుతున్న ప్రకారం పుల్ల పుల్లగా ఉండే చింతపండు వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని తెలియజేశారు. అయితే అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చింతపండులో అనేక అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. కూరల్లో వాడే పులుపు, రుచి కోసం వాడే చింతపండు ఆరోగ్యాన్ని కాపాడటంలో, చర్మాన్ని అందంగా ఉంచడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది.

చింతపండులో విటమిన్స్, పొటాషియం, ఐరన్, పీచు పదార్థంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బాక్టీరియల్ పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఉన్నటువంటి ప్లేవనాయిడ్స్ వంటి పాలీ ఫెనాల్స్ కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయ పడతాయి. చింతపండు బెరడు, వేరు పదార్థాలు కడుపు నొప్పికి సమర్థవంతంగా నివారించబడుతుంది. అందుకే మీరు కూడా రెగ్యులర్ గా చింతపండును వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. వీటితో పాటు మ‌ల‌బద్ద‌క స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు ప‌డుకోవ‌డానికి అర‌గంట ముందు కొద్దిగా చింత పండు ర‌సాన్ని తాగినా, లేదా కొద్దిగా తిన్నా మ‌రుస‌టి రోజు ఉద‌యం సుఖ విరేచనాలు జ‌రుగుతాయి.

Amazing Health Benefits of Tamarind
Amazing Health Benefits of Tamarind

అయితే ఎక్కువ మోతాదులో తీసుకుంటే విరేచ‌నాలు ఎక్కువ‌గా అయ్యే ప్ర‌మాదం కూడా ఉంది. జీర్ణాశయంలో ఉండే స‌మ‌స్య‌లు కూడా త‌గ్గి పొట్ట కూడా శ‌భ్రం అవుతుంది. అల్స‌ర్ స‌మ‌స్య‌ను కూడా కొద్దిగా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అధిక బ‌రువు ఉన్న‌వారు కూడా చింత‌పండు త‌రుచుగా వాడుతుంటే శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వ‌లు క్ర‌మేనా త‌గ్గ‌డంతో బ‌రువు త‌గ్గే అవకాశాలు కూడా ఎక్కువ‌గా ఉన్నాయి. చింత పండులో విట‌మిన్ సి నిల్వ‌లు అధికంగా ఉండ‌టంతో మ‌న‌లో రోగ‌నిరోధ‌క శ‌క్తిని కూడా పెంచుతుంది. రోగ‌నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉంటే క్యాన్స‌ర్లు లాంటి వ్యాధులు ద‌రికిచేర‌వు.