Jilledu Plant : జిల్లేడు చెట్టు ను మన ఇంటి చుట్టుపక్కల ప్రతి రోజూ చూస్తూనే ఉంటాం.. ఈ మొక్కలో బోలెడు ఔషధగుణాలు ఉన్నాయి. ఇవి అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పడతాయి.. తెలుపు, ఎరుపు జిల్లేడు రకాలు ఉన్నాయి. కాకపోతే జిల్లేడు పూలను, ఆకులను కోసేటప్పుడు మాత్రం.. ఆ చెట్ల నుండి జాలువారే పాలు కంటిలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మరి.. ఈ చెట్టు గురించి తెలియని ఆరోగ్య రహస్యాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..!!
జిల్లేడుఆకులను ముద్దగా నూరి పాము కాటేసిన చోట కట్టు కడితే విషప్రభావం శరీరానికి పాకదు. జిల్లేడు ఆకుల పొగను పీలిస్తే ఆస్తమా తగ్గిపోతుంది. జిల్లెడు వేరును కాల్చి ఆ వేరు తో పళ్ళు తోముకుంటే దంత సమస్యలు తొలగిపోయి, దృఢంగా ఉంటాయి. జిల్లేడు ఆకులకు ఆముదం రాసి గజ్జల కింద పెట్టుకుంటే అక్కడ ఉండే బిల్లలు పోతాయి. జిల్లేడు ఆకుల లో కొద్దిగా పసుపు కలిపి ముద్దగా నూరుకోవాలి. ఆ మిశ్రమాన్ని సెగగడ్డలు, వేడి కురుపులు, అరిచేతుల్లో బొబ్బలు

ఉన్న చోట ఈ మిశ్రమాన్ని రాస్తే త్వరగా తగ్గిపోతాయి.జిల్లేడు పాలలో పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే నల్లని మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఈ పాలను గాయాలపై రాస్తే త్వరగా రక్తం కారకుండా అడ్డుకుంటుంది. జిల్లేడు ఆకులకు ఆముదం రాసి కొద్దిగా వేడిచేసి కీళ్ళనొప్పులు ఉన్నచోట వేసి కట్టుకడితే కీళ్ల నొప్పులు త్వరగా తగ్గిపోతాయి. లేదంటే జిల్లేడు ఆకులలో కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా నూరాలి. ఆ మిశ్రమాన్ని కీళ్ల నొప్పులు ఉన్నచోట రాస్తే కూడా నొప్పులు తగ్గిపోతాయి.