Health Benefits : అరటిపండు ఎక్కడైనా సులువుగా, తక్కువ ధరకే దొరికే అద్భుతమైన పండు. దీనిని దేవుళ్ళకు కూడా ప్రసాదం, నైవేద్యలుగా సమర్పిస్తుంటారు. 6నెలల పసిబిడ్డకు కూడా మొదటి ఆహారంగా ఇస్తుంటారు. ఇది సీజన్ తో సంబంధం లేకుండా సంవత్సరం మొత్తం మార్కెట్ లో దొరుకుతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ దీనిని ఇష్ట పడుతారు. ఇది రుచికే కాక ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కళంగా లభిస్తాయి.
ఇందులో విటమిన్ సి, బి, B6, పొటాషియం, మెగ్నీషియం
కార్బోహైడ్రేట్, ఫాస్ఫరస్, షుగర్,స్టార్చ్, కాల్షియం, ఫైబర్,
ప్రోటీన్, సోడియం, మాంగనీస్, ఐరన్, జింక్ వంటి పోషకాలు పుష్కళంగా లభిస్తాయి.
1.అరటిపండులో ఉండే మెగ్నీషియం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. అరటి పండు అల్సర్ వ్యాధి నుంచి బాధపడుతున్న వారికి సహాయపడుతుంది
2. అరటి పండు గుండె యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది.అరటి పండులో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. పొటాషియం గుండె యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లో సహాయపడుతుంది. బీపీ ని కంట్రోల్ లో ఉంచుతుంది.
3.అరటికాయ జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేస్తుంది.అరటిపండు భోజనం తిన్న వెంటనే తింటూ వుంటారు. ఎందుకంటే ఇందులో ఉండే అధిక న్యూట్రియాంట్స్ తిన్న భోజనంను తొందరగా అరిగేలా చేస్తుంది.
4.అరటి పండు క్యాన్సర్ అరికట్టడంలో సహాయం చేస్తుంది. పొటాషియం మన శరీరానికి చాలా ముఖ్యం, కూరగాయలు మరియు అరటిపండ్లు తినేవారికి పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. పొటాషియం క్యాన్సర్ ని కలిగించే ప్రీ రాడికల్స్ ని నివారించడంలో సహాయం చేస్తాయి. ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతాయి.
5.అరటి పండు మన శరీర బరువు తగ్గించటంలో సహాయపడుతుంది. దీనిని తగిన మొతాదులో తీసుకోవడం వల్ల ఇందులో ఉండే అధిక ఫైబర్ శరీర బరువు తగ్గడానికి సహాయపడతాయి.
6. అరటిపండు లో అద్భుతమైన యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి. అరటిపండులో ఉండే యాంటీ యాక్సిడెంట్స్ మన శరీరాన్ని దీర్ఘ కాలిక వ్యాధులైన కిడ్నీ, పొట్ట సమస్యలు రాకుండా అరికడుతుంది.
7. అరటి పండు ఎక్సర్సైజ్ చేసే వారికి తక్షణమే శక్తినిస్తుంది. కానీ తగిన మోతాదులో తీసుకోవాలి.
8. అరటి పండు ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే క్యాల్షియం ఆస్టియోపొరాసిస్ అనే ఎముకలకు సంబంధించిన జబ్బుల నుండి కాపాడుతుంది.
9. అరటికాయ ఇన్సులిన్ రెసిస్టన్స్ కొరకు సహాయపడుతుంది. లో షుగర్ తో బాధపడేవారికి షుగర్ రెసిస్టెన్స్ కలిగిస్తుంది.
10. అరటిపండు రక్తహీనతతో బాధపడేవారికి బాగా ఉపయోగపడుతుంది.ఇందులో ఉండే B6(పోలిక్ యాసిడ్ ) రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది.