BEAUTY Tips : చర్మ సంబంధిత సమస్యలకు కలబంద ఒక మంచి మెడిసిన్ అని చెప్పవచ్చు. అంతేకాదు కొబ్బరినూనె కూడా మంచి ఔషద గుణాలు కలిగి ఉండడం వల్ల చర్మానికి సంబంధించిన అన్ని సమస్యలను దూరం చేయడంలో మొదటి పాత్ర పోషిస్తుంది. అయితే ఈ రెండింటినీ కలిపి వాడడం వల్ల మన చర్మానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం.ఎప్పుడైతే చర్మం ఆరోగ్యంగా ఉంటుందో.. అప్పుడు అందం కూడా రెట్టింపు అవుతుంది.. కానీ ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో పనులు, తగినంత నిద్ర లేకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, హానికరమైన సూర్యకిరణాలు, కాలుష్యం ఇలా అన్నీ కూడా చర్మాన్ని నిర్జీవంగా , పొడిగా మార్చేస్తాయి..ఈ పనులు మన జీవితంలో ఒక భాగం కాబట్టి వీటిని మార్చడానికి ప్రయత్నం చేసినా సక్సెస్ అయితే పొందలేరు అని చెప్పవచ్చు.. అయితే ఈ పనులను మార్చ లేకపోయినా మన చేసే పనులలో మరి కొన్ని పనులు కలుపుకుంటే తప్పకుండా ఏ సీజన్లో అయినా సరే గ్లోయింగ్ లుక్ ను పొందవచ్చు.

అలోవెరా : ప్రతి ఒక్కరి పెరటిలో ..అందుబాటులో ఉండే ఈ మొక్కతో చర్మానికి, జుట్టుకు సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టవచ్చు. స్వచ్చమైన కలబంద చర్మ సమస్యలను దూరం చేసి క్లియర్ స్కిన్ ను అంధిస్తుంది. విటమిన్స్, ఎంజైమ్స్, న్యూట్రియన్స్, కార్బోహైడ్రేట్స్ , సపోనిన్స్, సాలిసిలిక్ యాసిడ్, లిగ్నిన్స్, అమైనో ఆసిడ్స్ వంటి 75 క్రియాశీల పదార్థాలను కలిగి ఉంటుంది. అలోవేరా పూర్తి నాచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.
కొబ్బరి నూనె : పచ్చి కొబ్బరి నూనెను ముఖానికి రాసుకుంటే చర్మానికి.. హానికరమైన UV రేడియేషన్ కి మధ్య రక్షణనిస్తుంది.. ప్యూర్ కోకోనట్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల కొబ్బరి నూనె లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వల్ల వడదెబ్బ, దురద, మంట ను నయం చేస్తుంది..
ఇక ఈ రెండింటినీ కలిపి ఒక మిశ్రమాన్ని మీరు తయారు చేసుకోవచ్చు.. కలబందను శుభ్రంగా కడిగి వాటి నుంచి లోపల జెల్ మొత్తాన్ని బయటకు తీయాలి. ఇప్పుడు బాగా బ్లెండ్ చేసి ఒక గిన్నెలో కలబంద కొద్దిగా కొబ్బరినూనె రెండింటిని బాగా మిక్స్ చేయాలి. ఒక డబ్బాలో నిలువ ఉంచుకుని.. అవసరమైన ప్రతిసారీ వాడితే మంచి చర్మం మీ సొంతం అవుతుంది.