Watermelon Seeds : 96 శాతం అధికంగా నీటిని కలిగి ఉన్న పుచ్చకాయ వేసవి కాలంలో ఒక మంచి ఔషధం అని చెప్పవచ్చు. శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడడంలో పుచ్చకాయ సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని వల్ల శరీరానికి అవసరమైన నీరు అందడమే కాకుండా అనేక పోషకాలు కూడా లభిస్తాయి. అంతే కాదు శరీరం అలసి పోకుండా ఉంటుంది. ఇక అధిక వేడి వల్ల కలిగే నీరసం, అలసట వంటి సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు . ఇక పోతే ఆరోగ్య నిపుణులు పుచ్చకాయలు మాత్రమే తిని గింజలను పడేసే వారికి హెచ్చరిక జారీ చేయడం జరిగింది. చెప్పాలంటే పుచ్చకాయ గింజలలో కూడా పోషక విలువలు అధికంగా ఉన్నాయట.
మీకు తెలిసిన వారెవరైనా సరే పుచ్చకాయ గింజలను పడేస్తూ ఉంటే వారికి ఈ ఆర్టికల్ వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసి సమాచారాన్ని అందించండి.అసలు విషయంలోకి వెళితే.. పుచ్చకాయ గింజలు ఎప్పుడు ఎలా తీసుకోవాలో కూడా ముందుగా మనం తెలుసుకోవాలి. పుచ్చకాయ గింజలలో మెగ్నీషియం, ఐరన్ , జింక్ వంటి ఆరోగ్యకరమైన పోషకాలు కొవ్వులు పుష్కలంగా లభిస్తాయి. అంతే కాదు పాలీ అన్ శాచ్యురేటెడ్ అలాగే మోనో అన్ శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు కూడా మనకు బాగా లభిస్తాయి. వీటివల్ల శరీరానికి కావలసిన అన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఊబకాయం సమస్యతో బాధపడుతున్న వారికి పుచ్చకాయ గింజలు సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు.
అయితే కేవలం నాలుగు గ్రాముల విత్తనాలను మాత్రమే తీసుకుంటే ఊబకాయాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.ఇక డయాబెటిస్ వారు ప్రతిరోజూ శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారు పుచ్చకాయ గింజలు తినడం వల్ల సమస్యలు అదుపులో ఉంచుకోవచ్చు. మెరిసే చర్మానికి కూడా ఇవి చాలా బాగా పనిచేస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, జింకు, మెగ్నీషియం వంటి పోషకాలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అంతేకాదు పుచ్చకాయ గింజలు తినడం వల్ల ఇలాంటి సమస్యలు దూరం అవుతాయి.