Health Tips : సాధారణంగా మెంతికూరను పప్పు లేదా ఫ్రై చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు.. మెంతికూర లో విటమిన్ ఎ , క్యాల్షియం పుష్కలంగా లభించడం వల్ల గుండెపోటు ను అదుపులో ఉంచుతుంది. అలాగే కంటి సమస్యలను దూరం చేసి గజ్జి, రక్తహీనత, రుమాటిజం వంటి సమస్యలకు చికిత్స చేయడానికి మెంతికూర చాలా చక్కగా పనిచేస్తుంది. ఇక కొత్తగా పాలిచ్చే తల్లులకు మెంతికూర ఎక్కువ పాలను అందిస్తుంది. ప్రసవ నొప్పులు, బహిష్టు నొప్పిని కూడా మెంతికూర తగ్గిస్తుంది. పేగు అల్సర్ కు, అలర్జీలు, కడుపు అలర్జీలను నివారించడంలో మెంతికూర చాలా చక్కగా పనిచేస్తుంది.
రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. నోటి దుర్వాసనతో బాధపడేవారికి చక్కటి ఔషధం అని చెప్పవచ్చు. మెంతి కూర వల్ల మనకు ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే తట్టుకొని పెరిగే మెంతికూర లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాదు మెంతి ఆకుల్లో ఇనుము సమృద్ధిగా లభించడం వల్ల రక్తహీనత సమస్యను నివారిస్తుంది.. మెరుగైన రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది.. మెంతి ఆకులను సన్నగా తరిగి నీళ్ళలో వేసి ఆ నీటిని ఉదయం, సాయంత్రం తాగితే ఛాతి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. ఇక అధిక వేడి తో బాధపడుతున్న వారు కూడా తినడం వల్ల ఇందులో ఉండే శీతలీకరణ గుణాలు శరీరంలోని వేడిని తగ్గించి శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి.

దగ్గు, జలుబు ఉన్నవారు కూడా మెంతి కూర తింటే త్వరగా కోలుకుంటారు. మెంతి ఆకులను ఉడకబెట్టి వెన్నెలో వేయించి తింటే పిత్తం వల్ల వచ్చే తలతిరుగుట అనేది నయమవుతుంది. రోగాలను కూడా తగ్గించే శక్తి మెంతికూర కు ఉంది. మెంతి ఆకు సౌలభ్యం లేనివాళ్ళు మెంతి లనైనా ఉపయోగించవచ్చు. మెంతులతో జుట్టు పెరుగుదలను కూడా పెంపొందించుకోవచ్చు. శరీరానికి తగినన్ని ప్రొటీన్లు కూడా అందిస్తుంది. కంటి చూపు లోపంతో బాధపడేవారు.. మెంతి కూరలు తినడం వల్ల దృష్టిలోపం వంటి సమస్యలు దూరం అవుతాయి. మతిమరుపు వంటి సమస్యలకు కూడా మెంతి కూర చాలా బాగా పనిచేస్తుంది