Hair Problems : ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికీ మగ , ఆడ, చిన్న , పెద్ద అనే తేడా లేకుండా జుట్టు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి.. మరియు ముఖ్యంగా జుట్టు సమస్యలు అధికం అవుతూ ఉండడం వల్ల ఏం చేయాలో తెలియక వైద్యుల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ని ఇప్పుడు చెప్పబోయే కొన్ని సహజసిద్ధమైన చిట్కాలతో జుట్టు సమస్యలన్నింటిని దూరం చేసుకోవచ్చు. ఇక ఆ చిట్కాలేంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..ముందుగా ఒక శుభ్రమైన బౌల్ తీసుకొని అందులో ఒక బాగా పండిన అరటిపండు గుజ్జును మెత్తటి పేస్టులా చేయాలి.
ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె , ఒక టేబుల్ స్పూన్ చమురు వేసి పూర్తిగా మిక్స్ చేయాలి. ఇక ఈ పేస్టుని జుట్టు కుదుళ్ళకు అలాగే జుట్టుకు పూర్తిగా అప్లై చేసి ముడిపెట్టి వదిలేయాలి. గంట ఆగిన తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికొకసారి చేయడం వల్ల జుట్టు సమస్యలు అన్ని దూరం అవుతాయి.. ముఖ్యంగా జుట్టు రాలడం వంటి సమస్య తగ్గుతుంది.ఈ పేస్ట్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల చిట్లిపోయిన, విరిగిపోయిన జుట్టు రిపేర్ అవుతుంది. జుట్టు ఒత్తుగా.. పొడవుగా పెరగడం తో పాటు సహజంగా కాంతివంతంగా తయారవుతుంది.

ఇక జుట్టు రాలిపోవడాన్ని క్రమంగా ఈ హెయిర్ మాస్క్ తగ్గిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. జుట్టు నిర్జీవంగా మారినప్పుడు..ఈ హెయిర్ మాస్క్ వేయడం వల్ల జుట్టు కళ తిరిగి పొందడమే కాకుండా తాజాగా కోమలంగా తయారవుతుంది. అంతే కాదు హెయిర్ నల్లగా మారడానికి.. మీ జుట్టు సిల్కీగా మారడానికి కూడా ఈ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది.ఇక ఇలాంటి ప్యాక్ ల వల్ల జుట్టుకు ఎలాంటి డ్యామేజ్ అవ్వదు.. పైగా జుట్టు సంరక్షణ పెరుగుతుంది.