Hair Problems : జుట్టుకు సంబంధించిన సమస్యలు అంటే జుట్టు రాలిపోవడం, చిట్లిపోవడం, తలలో పేలు, చుండ్రు, వెంట్రుకలు మధ్యలోకి విరిగిపోవడం.. నిర్జీవంగా మారిపోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు జుట్టుకు వస్తూనే ఉంటాయి.. అందుకే ఈ జుట్టు సమస్యలను దూరం చేసుకోవడానికి అమ్మాయిలు, అబ్బాయిలు ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు చెప్పబోయే కొన్ని ఆకులు సమ్మేళనంతో ఇలాంటి జుట్టు సమస్యలు అన్నీ దూరం అవుతాయి. ఇక పోతే ఆ ఆకులు ఏమిటి..? ఎలా ఉపయోగించాలి..? అనే విషయాలను తెలుసుకుందాం..ఇక పోతే ఈ చిట్కా కోసం..
జుట్టుకు సరిపడా మిశ్రమాన్ని తయారు చేసుకోవడానికి కొన్ని జామ ఆకులు, మరికొన్ని మందార ఆకులు అలాగే గుప్పెడు మునగ ఆకులు అన్ని మిక్సీ జార్ లో వేసి మెత్తటి పేస్ట్ లాగ తయారుచేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఈ వేసి అందులో బియ్యం కడిగిన నీళ్ళు కలిపి.. ఒక బట్టలో వేసి ఆ నీటిని బయటకు తీయాలి.. ఇక ఇలా ఈ మూడు ఆకుల సమ్మేళనంతో పాటు నీళ్లు కూడా కలిసి ఉంటాయి.. కాబట్టి దీనిని జుట్టు మాడుకు పట్టించాలి.. ఒక నలభై నిమిషాలు ఆగిన తర్వాత మీరు ఉపయోగించే రెగ్యులర్ షాంపూతో తల స్నానం చేయవచ్చు.ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా జుట్టు సమస్యలు అన్ని దూరం అవుతాయి.

జామ ఆకుల లో విటమిన్ సి, విటమిన్ బి ఉండడం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడి, చుండ్రు రాకుండా అడ్డుకుంటాయి. అంతేకాదు జామ ఆకుల లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కారణంగా జుట్టు సమస్యలు దూరం అవుతాయి. మందార ఆకులలో ఉండే అమినో ఆసిడ్స్ చుండ్రుని తగ్గించి తెల్ల జుట్టును నల్లగా మారుస్తాయి. అలాగే జుట్టు మృదువుగా మారడానికి మందార ఆకులు ఎంతగానో సహాయపడతాయి. ఇక మునగాకులలో విటమిన్-ఏ, విటమిన్-సి ఉండడం వల్ల జుట్టు పెరుగుదలకు దోహదపడతాయి.