Nikitha Bola sister marriage Ganesh on super story : మధ్య ప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని జిల్లాలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. నికితా, బోలా అనే అక్క చెల్లెల్లు ఉండేవాళ్ళు. వాళ్ళకి వాళ్ళ నాన్న ఒకేసారి పెళ్లి చేయాలని అనుకున్నాడు.. వాళ్ళిద్దరికీ వాళ్ల తండ్రి వేరు వేరు వ్యక్తులతో వేరు వేరుగా ఎంగేజ్మెంట్ కూడా చేశాడు. కాకపోతే వాళ్లకు ఒకేసారి పెళ్లి చేస్తే భోజనాలు ఖర్చు మిగిలింది అని అనుకున్నాడు ఏమో తెలియదు కానీ ఇద్దరి పిల్లలు ఒకేసారి చేయాలని అనుకున్నడు ఇక తనకి ఉన్నంతలో పెళ్లి ఏర్పాట్లు చేశాడు..
ఇక ఆ పెళ్లి సమయానికి ఏర్పాట్లు అన్నీ జరిగినా కానీ సరిగ్గా తాళికట్టే పది నిమిషాల ముందు కరెంటు పోయింది. పెళ్లికూతురుల తండ్రి కరెంట్ ఆఫీస్ కి ఫోన్ చేసి చెబితే.. ఇక్కడ సీఎం మీటింగ్ కే కరెంటు లేదు . ఇక నీ కూతుర్ల పెళ్ళికి కరెంటు కావాల్సి వచ్చిందా అని ఫోన్ పెట్టేస్తాడు. ఇక చేసేది ఏమీ లేక ఆ చీకటిలోనే తాళి కట్టి ఇచ్చేస్తాడు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. అదేంటంటే పెళ్లికూతురులది బోలా ఆచారం. ఈ ఆచారంలో పెళ్ళికూతురు ముసుగేసుకుని ఉంటారు . ఇక పెళ్లి తంతు ముగిసే వరకు పెను తుఫాను వచ్చినా కూడా ఆ ముసుగు తీయకూడదు. అయితే కరెంటు పోయింది కదా అని ఆ అక్కచెల్లెళ్లయినా పెళ్లి కూతురు ఇద్దరు కాసేపు పక్కకు వెళ్లారు. ఇక వాళ్ళ నాన్న కరెంటు రాదని చెప్పడంతో గబగబా వచ్చి ప్లేస్ లు తారుమారు అయ్యాయి. ఇక పెళ్ళికొడుకులు కూడా ఆ పెళ్ళికూతురుల మొహాలు చూడకుండా తాళి కట్టేశారు. ఇక అదే రోజు రాత్రి మొదటి రాత్రికి కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంకో అసలైన ట్విస్ట్ ఉంది.
గణేష్ అనే పెళ్లి కొడుకు తన భార్యను తీసుకొని తన ఇంటికి వెళ్లి మొదటి రాత్రి గదిలో తన భార్య దగ్గరకు వెళ్లి ఇంకా సిగ్గెందుకు ఆ ముసుగు తీయమని అంటాడు ఇక గణేష్ కి ఒక్క ఫిట్స్ తప్ప అన్ని షాకులు ఒక్కసారిగా వచ్చాయి ఎందుకంటే తను చేసుకోవాల్సిన అమ్మాయి బోలా కానీ అక్కడ ఉన్నది మాత్రం నికిత. ఇక రూమ్ లో నుంచి అందరికీ వినిపించేలాగా అసలు ఇక్కడికి నువ్వు ఎలా వచ్చావ్ అంటూ చిందులు తొక్కుతాడు ఇక వెంటనే తన అత్తగారికి ఫోన్ చేసి అసలు నా వెంట ఎవరిని పంపించారో కూడా చూసుకునే పని లేదా.. ముందు నా భార్య అయినా బోలా కి నికిత చేసుకునే భర్త ఇంటికి ఎలా పంపించారు. ముందు అర్జెంటుగా అక్కడ శోభనం జరగకుండా ఆపండి అంటూ తన అత్త మీద పెద్ద పెద్దగా అరుస్తాడు.
ఇక అత్త కూడా అదే విషయాన్ని ఫోన్ చేసి మరో అల్లుడికి చెబుతుంది .దాంతో నిఖితకి శోభనం జరగకుండా ఆపేస్తారు. ఇక మరుసటి రోజు పంచాయితీ పెట్టి అసలు విషయాన్నీ తెలుస్తారు. గణేష్ నికితను తన పుట్టింటికి పంపించేసి తను చేసుకోవాలనుకున్న బోలా తో మరోసారి గుడిలో ముచ్చటగా మూడు ముళ్ళు వేస్తాడు..