Singer Sunitha : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోలకు, హీరోయిన్లకు ఎంత గుర్తింపు అయితే ఉంటుందో.. సినిమాలలో పాటలకు ప్రాణం పోసే గాయని గాయకులకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 27 ఏళ్లకు పైగానే అవుతున్నా.. తన అందంతో.. నడకతో.. పాటతో అచ్చమైన తెలుగుదనానికి చిరునామాగా నిలిచిన సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా గులాబీ సినిమా ద్వారా “ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో” అనే పాటతో ఓవర్ నైట్ లోని స్టార్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంది సునీత. సునీత తన కెరియర్లో కొన్ని వేల పాటలు పాడినప్పటికీ ఈ పాట వింటేనే టక్కున గుర్తొచ్చే పేరు సునీత.. అంతలా ఈ పాట ద్వారా తను పాపులారిటీని సంపాదించుకుంది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీతను యాంకర్ రోషన్ రకరకాల ప్రశ్నలను అడిగి తన వ్యక్తిగత జీవితాన్ని, అలాగే సింగర్ గా , డబ్బింగ్ ఆర్టిస్టుగా తన కెరియర్ కి సంబంధించిన అన్ని విషయాలను ఆయన రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఎన్నో విషయాలను సునితను అడిగి మరీ తెలుసుకోవడం జరిగింది. ఇంటర్వ్యూలో భాగంగా ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించారు.. వీటన్నింటిని దాటుకొని ఎలా నెగ్గుకు రాగలుగుతున్నారు అని యాంకర్ ప్రశ్నకు.. సునీత మాట్లాడుతూ .. ” నేను అంటూ ఒక పరిధి పెట్టుకున్నాను. ఆ పరిధి వరకే ఉండాలని ఆలోచిస్తాను.. అందుకే ఎటువంటి స్ట్రగుల్స్ అయినా సరే సంతోషంగా ఫేస్ చేస్తాను” అంటూ తెలిపింది.
అంతేకాదు తన వైవాహిక జీవితం పై వచ్చిన రూమర్స్ గురించి కూడా యాంకర్ ప్రశ్నించగా.. ఒకరకంగా ఆమెను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగినప్పటికీ సునీత మాత్రం ధైర్యంగా వాటికి సమాధానం చెబుతూ వచ్చింది. అయితే ఇంకాస్త మితిమీరి యాంకర్ రోషన్ సునీతను ఇబ్బంది పెట్టే విధంగా ప్రశ్నలు అడగడంతో.. “తన తల్లిని యాంకర్ అడుగుతున్న ప్రశ్నలకు ఒళ్ళు మండిపోయిన సునీత కొడుకు ఆకాష్ నేరుగా ఇంటర్వ్యూ లైవ్ లోకి వచ్చేసారు”. అయితే సునీత కొడుకు ఆకాష్ లైవ్ లోకి ఇంటర్వ్యూ గాని ఒక్కసారిగా షాక్ అయిపోయిన సునీత.. ఆ తర్వాత యాంకర్ రోషన్ రిక్వెస్ట్ మేరకే ఆకాష్ అక్కడికి వచ్చినట్లు రివీల్ చేశారు.. మొత్తానికైతే ఈ వీడియో బాగా వైరల్ గా మారుతోంది.