PM Modi: ప్రధాని మోదీ సోదరుడికి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక..!

PM Modi.. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద మోదీ అస్వస్థకు గురయ్యారు. ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతూ చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం మంగళవారం అడ్మిట్ అయినట్లు తెలుస్తోంది. ప్రహ్లాద మోదీ ప్రధాన మోదీకి తమ్ముడు.. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. గత ఏడాది డిసెంబర్ నెలలో మైసూర్లో ప్రహ్లాద్ మోదీ.. ఆయన కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో వీరిని నగరంలోని జెఎస్ఎస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన విషయం తెలిసిందే.

PM Modi Brother Hospitalised: पीएम मोदी के भाई अस्पताल में भर्ती, इस गंभीर  बीमारी का चल रहा इलाज - News Nation

ఇకపోతే ప్రధాని నరేంద్ర మోదీకి నలుగురు సోదరులు కాగా సోమ మోదీ, అమృత్ మోదీ, పంకజ్ మోదీ, ప్రహ్లాదు మోదీ.. సోదరీ వాసంతి మోదీలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ప్రహ్లాదు మోదీ కిడ్నీ సమస్యతో ఆసుపత్రిలో చేరారు .. ఈయన నాల్గవ వ్యక్తి.. మోదీ కంటే రెండు సంవత్సరాలు చిన్నవారు. ఆయన అహ్మదాబాద్ లో కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తుంటారు. అలాగే నగరంలో టైర్ షో రూమ్ కూడా నిర్వహిస్తున్నారు.