Bodhi Dharma : బోధి ధర్మ గురించి ఎవ్వరూ చెప్పని, తెలియని విషయాలు..

Bodhi Dharma :  బోధి ధర్మ భారత దేశీయుడు.. బోధిధర్మ కారణంగానే చైనాలో బుద్ధిజం మొదలైంది. ఆయన ద్వారానే వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ కుంఫు అనేవి కూడా షావలెన్ టెంపుల్ కూడా ఈయన వల్లనే జరిగాయి. బోధిధర్మకు పెళ్లి కాలేదు. ఒక సన్యాసి.. బోధిధర్మ పూర్వికులు ఆంధ్రప్రదేశ్ లోని పలనాడుకు చెందినవారు. కానీ వారు అక్కడి నుంచి తమిళనాడులో జీవనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారి శక్తిసామర్థ్యాల మేరకు కాంచి పురం రాజుగా కూడా అయ్యారు. అప్పటి రాజుz మూడవ కొడుకు ఈ బోధిధర్మ. కానీ చరిత్రలో ఉన్నట్టుగా ఆయన వయసు ఎక్కువగా ఉన్నప్పుడు బుద్ధిజం తీసుకున్నారు అని అనుకుంటారు. కానీ ఆయన ఏడవ ఏట నుంచే బుద్ధిజంలో నడిచారు.

బౌద్ధ మతాన్ని కేవలం భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచానికి పరిచయం చేయాలని అనుకున్నారు. అందుకే చైనాకు వెళ్లాలి అనుకున్నారు ఆ మార్గం మధ్యలో జంబుద్వీపం, ఇండోనేషియా, బాలి, సుమిత్రబివుల్లో కూడా బౌద్ధాన్ని వారికి నేర్పించి ఆ తరువాత చైనా వెళ్లారు.చైనాలోని ఓ రాజు దగ్గరకు బోధిధర్మ వెళ్తాడు . కానీ బోధిధర్మ అసలు జ్ఞాని కాదు అని ఆ రాజు అనుకుంటాడు.. ఆయన వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయి కఠోరమైన దీక్ష చేస్తూ ఉంటాడు.

ఒకరోజు ఒక శిష్యుడు బోధిధర్మ దగ్గరకు వెళ్లి తన చేతిని కోసుకోవడంతో ఆ రక్తం చింది బోధిధర్మ తన ధ్యానంలో నుంచి బయటకు వస్తాడు. తనతో పాటు మరికొంతమంది శిష్యులు కూడా ఆయన దగ్గరకు వచ్చి మీరు చేసే కర్మలను నేర్పించమని అడుగుతారు. ఇక బోధిధర్మ వాళ్ళందరికీ కుంఫు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తారు. ఆ తర్వాత మెడిటేషన్ ఎలా చేయాలో నేర్పిస్తారు బోధిధర్మ. అయితే నిద్రను ఎట్టి పరిస్థితుల్లోనూ దరి చేరనివ్వొద్దని బోధిధర్మ చెబుతాడు .

కానీ ఒక రోజు తానే ఆదమరిచి నిద్రపోతాడు. దాంతో తనమీద తనకే కోపం వచ్చే తన కనురెప్పలను కత్తితో కోసేసుకుంటాడు బోధిధర్మ. ఆ కనురెప్పలు నేల మీద పడి తేయాకు చెట్టులుగా మారుతాయి. ఆ చెట్టు ఆకులతో టీ చేసుకుని నిద్ర రాకుండా చేసుకునేవారు బోధిధర్మ శిష్యులు. వాస్తవాన్ని మనసుతో చూడమని బోధిధర్మ చెపుతూ ఉండేవాడు. షావలిన్ టెంపుల్ నిర్మాణానికి కూడా బోధిధర్మనే కారణం. ఆయన ఆ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా ఆయన శిష్యులు ఎంతోమందికి కుంఫు, కరాటే, మార్షల్ ఆర్ట్స్ నేర్పించారు. బోధిధర్మ చైనా భాషలో రెండు పుస్తకాలు రాశారు. అయితే బోధిధర్మకు ఎవరో విషం పెట్టి చంపేశారు.