tirumala.. తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి భక్తులకు శుభవార్త తెలిపింది.. ఏకంగా మూడు నెలలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్లైన్ కోటాను రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఫిబ్రవరి 22 సాయంత్రం నాలుగు గంటలకు టీటీడీ ఆన్లైన్ లో అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం. వీటిలోనే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం , సహస్రదీపాలంకరణ సేవలు కూడా ఉన్నట్టు టీటీడీ స్పష్టం చేసింది.
అంతేకాదు మూడు నెలలకు సంబంధించిన మిగతా ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్ లక్కీ డిప్పు నమోదు ప్రక్రియ ఫిబ్రవరి 22 ఉదయం 10 గంటల నుంచి ఫిబ్రవరి 24 ఉదయం 10 గంటల వరకు ఉంటుందని టీటీడీ పేర్కొంది. ఈ లక్కీ డిప్ లో టికెట్లు పొందిన వారు నగదు చెల్లించి టికెట్ ఖరారు చేసుకోవాలని సూచించింది. ఎలా బుక్ చేసుకోవాలంటే టీటీడీ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి జనరేట్ ఓటిపీపై క్లిక్ చేయాలి. ఓటిపి ఎంటర్ చేస్తే టికెట్ బుక్ చేసుకోవడానికి వివిధ తేదీలతో కూడిన స్లాట్ ఓపెన్ అవుతుంది. మీకు నచ్చిన తేదీని సెలెక్ట్ చేసుకొని మనీ పేమెంట్ చేస్తే సరిపోతుంది.