Taraka Ratna: నందమూరి తారకరత్న గుండెపోటుతో ఆసుపత్రి పాలై సుమారు 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన అనంతరం నిన్న శనివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే.. నందమూరి తారకరత్న మరణంతో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. నందమూరి తారకరత్న పార్థివదేహాన్ని ఆదివారం ఉదయం తెల్లవారుజామున సమయానికి రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి సమీపంలోని మోకిలలో ఉన్న తారకరత్న స్వగృహానికి తరలించారు.. మోకిలలోని స్వగృహానికి నందమూరి తారకరత్న పార్థివ దేహం వస్తోందని ముందే తెలుసుకున్నా నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ రోజంతా నందమూరి తారకరత్న పార్దివదేహాన్ని బంధుమిత్రుల సందర్శనార్థం ఆయన స్వగృహంలోనే ఉంచి.. రేపు సోమవారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ కి తరలించనున్నారు..
నందమూరి అభిమానులు సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నందమూరి తారకరాత్మ పార్థివదేహాన్ని ఫిలిం ఛాంబర్ లోనే ఉంచి.. ఆ తరువాత అక్కడి నుంచి జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంకు తరలించనున్నారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు నందమూరి తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి. తారకరత్న ఇక లేరన్న వార్త నందమూరి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది..
ఆగస్టు 1న స్వర్గీయ నందమూరి తారక రామారావు చిన్న కూతురు కంటమనేని ఉమామహేశ్వరి హైదరాబాద్ లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని తను చాలించారు. ఇంతలోనే మరొక విషాదం నందమూరి కుటుంబంలో చోటుచేసుకుంది..

కాగా నందమూరి తారకరత్న పార్థివదేహాన్ని తీసుకువస్తున్నారని వారి ఇంటి విజువల్స్ చూడగా అంతా నిర్మానుష్యంగా కనిపిస్తోంది. ఆయన లేరన్న వార్తను అభిమానులు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారు అనుకున్నారు. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. తారకరత్న తన వారిని శోకసంద్రంలో ముంచేసి అనంత లోకాలకు వెళ్లిపోయారు.