Taraka Ratna : నందమూరి తారకరత్న నిన్న రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసింది ఈరోజు ఉదయం తెల్లవారుజామున మోకిలలోని ఆయన స్వగృహంలో తారకరత్న భౌతికకాయాన్ని చూసి కన్నీటిపర్యంతమవుతున్నారు కుటుంబసభ్యులు. 23రోజులుగా బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందిన తారకరత్న.. కోలుకొని పూర్తి ఆరోగ్య తిరిగొస్తాడని అంతా ఆశగా ఎదురు చూశారు కానీ.. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి నిన్న రాత్రి కన్నుమూశారు. బెంగళూరు నుంచి అంబులెన్స్‌లో అయన ఇంటికి తరలించారు. తారకరత్న భౌతికకాయాన్ని చూసి కన్నీరుమున్నీరవుతున్నారు కుటుంబసభ్యులు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తన కూతుర్ని ఎత్తుకొని తన తండ్రిని చూపిస్తుండగా.. తన తండ్రిని చూసి కుమార్తె వెక్కి వెక్కి ఏడుస్తున్న దృశ్యం అందరినీ కలిచివేస్తోంది. తండ్రి ఇక తిరిగిరాడని తలుచుకొని ఆ చిన్నారి తల్లడిలిపోతోంది.. తారక రత్న కూతురు బోరున విలపించడం అందరినీ
తారకరత్న భౌతికకాయాన్ని ఇవాళ మోకిలలోని ఆయన నివాసంలోనే ఉంచుతారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెలుగు ఫిల్మ్ చాంబర్‌లో అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
తారకరత్న ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా చేస్తున్న సమయంలోనే ఏకంగా 9 సినిమాలు అనౌన్స్ చేసి సంచలనం సృష్టించారు నందమూరి తారకరత్న. టాలీవుడ్ కి తారకరత్న ఎంట్రీ ఇస్తూనే ఒకేసారి 9 సినిమాలకు సంతకం చేసి అరుదైన రికార్డును క్రియేట్ చేశారు.

కానీ తారక రత్న కి మాత్రం అదృష్టం కలిసి రాలేదు. 15 కు పైగా సినిమాలు చేశారు. హీరోగా అదృష్టం కలిసి రాకపోవడంతో విలన్ కూడా చేసి మెప్పించారు.. 2022లో 9 అవర్స్ సిరీస్‌లోనూ నటించారు. అమరావతి సినిమాలో నటనకు బెస్ట్ విలన్‌గా నంది అవార్డ్ అందుకున్నారు తారకరత్న.