Wife Twist : కర్ణాటకలోని బెంగుళూరు దగ్గర హైవేపై తోటత్తగుట్ట హల్లి గ్రామం దగ్గర 46 ఏళ్ల శివలింగ 44 అతని భార్య శోభ కలిసి హోటల్ పెట్టుకున్నారు. ఇక అదే ప్రాంతంలో నివసిస్తున్న 45 ఏళ్ల రాము అనే వ్యక్తిని వాళ్ళ హోటల్లో పనికి పెట్టుకున్నారు. రెండేళ్లలో హోటల్ బిజినెస్ బాగా సక్సెస్ అయింది. సంపాదన బాగా పెరిగింది .ఇక ఏడాదికి ఎంత లేదన్న ఆరు లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. రాముకి కూడా ఎలా టిఫిన్స్ చేయాలో నేర్పించాడు శివలింగ. అయితే హోటల్లో పనిచేస్తున్న రాము పై మనసు పారేసుకుంది. శివలింగ భార్య శోభ ఆమె చూడటానికి తెల్లగా బాగా అందంగా ఉంటుంది. ఆమె భర్త శివలింగ చాలా మంచివాడు కానీ అతని కంటే అందంగా ఉన్న రాముపై మనసు పారేసుకుంది.
అతన్ని తన మాటలతో చూపులతో తన గుప్పెట్లోకి తెచ్చుకుంది శోభ. ఇక హోటల్ యజమాని తనని కోరుకోవటంతో రాము కూడా ఆమెకు దగ్గరయ్యాడు. సరుకుల కోసం శివలింగా బయటికి వెళుతున్నప్పుడు శోభ , రాము హోటల్ వెనుక భాగంలో ఉన్న గదిలో ఏకాంతంగా గడిపేవారు. అలా కొన్నాళ్లపాటు వాళ్ళ బంధం కొనసాగింది. హోటల్ బిజినెస్ లో పడి శివలింగ శోభ, రాము గురించి పట్టించుకోకుండా ఉన్నాడు. రాము పదివేల ఉద్యోగం కోసం 18 గంటలు పనిచేస్తున్నాడని అనుకున్నాడే కానీ.. తన భార్య సుఖం కోసం ఇదంతా చేస్తున్నాడని గ్రహించలేకపోయాడు శివలింగ. మరోవైపు ఇక్కడ హోటల్ బిజినెస్ సాగుతుండడంతో మరొకచోట హోటల్ పెట్టాలని భావించాడు శివలింగ.
పాత హోటల్ ను భార్యను చూసుకోమని చెప్పాడు. ఇక కొత్త హోటల్ తను చూసుకుంటానని చెప్పాడు. ఇక శోభా రాముకి అడ్డు అదుపు లేకపోయింది. ఇద్దరి బంధం బాగానే సాగుతోంది. భార్య మీద ఉన్న నమ్మకంతో శివలింగ వారానికి ఒక్కరోజు కూడా హోటల్ కి వచ్చి చూసుకునే వాడే కాదు. రెండు హోటల్స్ బాగా సక్సెస్ అయ్యాయి. బాగా డబ్బులు వస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో లాక్ డౌన్ వచ్చింది. ముందుగా శివలింగ హోటల్ ను మూసివేశారు. ఆ తర్వాత శోభ చూసుకుంటున్న హోటల్లో కూడా మూసివేయాల్సి వచ్చింది.
లాక్ డౌన్ తర్వాత ముందుగా పాత హోటల్ ను ఓపెన్ చేశారు. అయితే శివలింగ దగ్గరే ఉంటూ ఆ హోటల్ని చూసుకుంటున్నారు. అప్పుడే శోభ రాముల ప్రవర్తనలపై కాస్త అనుమానం కలిగింది. శివలింగకు ఒకరోజు సరుకులు తీసుకువస్తానని బయటకు వెళ్లి.. హోటల్ వెనుక వైపు కాస్త దూరంగా నక్కి ఉన్నాడు. శివలింగ బయటకు వెళ్ళగానే శోభా రాము ఇద్దరూ గదిలోకి వెళ్లి ఏకాంతంగా గడుపుతున్నారు.. సరిగ్గా అదే సమయానికి శివలింగ వెళ్లి అసలు విషయాన్ని తెలుసుకున్నాడు.
దాంతో తన భార్యను అక్కడికక్కడే చితకబాదాడు. రాముని కొట్టి ఇంకోసారి ఇటువైపు రావద్దని చెప్పి పంపించేసాడు. దాంతో ఈ సమస్య ముగిసిపోయిందిలే అని అనుకున్నాడు శివలింగ. ఇక శివలింగ సరుకుల కోసం బయటకు వెళ్ళినప్పుడల్లా శోభ రాముకి ఫోన్ చేస్తూ ఉండేది శోభ. తమ ఇద్దరి ఏకాంతనికి అడ్డుగా ఉన్నాడని తన భర్తను చంపేయాలని ప్లాన్ చేసుకుంటారు.
శోభా రాము ఇక ఒక రోజు హోటల్ వెనుక రూమ్ లో నిద్రిస్తున్న శివలింగపై శోభా రాము ఇద్దరిని దాడి చేసి చంపేస్తారు. ఆ శవాన్ని ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఊరి చివరల ఎక్కడో పడేస్తారు.తన కొడుకు ఫోన్ చేయడం , కనిపించడం లేదని శివలింగ నాన్న వచ్చి శోభను నిలదీస్తాడు. తను ఎక్కడికో వెళ్ళాడు వస్తాడులే అని చెప్పి పంపించేస్తుంది.
శివలింగ తమ్ముడు కూడా ఒక నెల రోజులు తర్వాత హోటల్ దగ్గరకు వచ్చి శోభను అన్నయ్య ఎక్కడ వదిన అని అడుగుతాడు. మీ అన్నయ్యకు ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని.. లక్షన్నర తీసుకొని పారిపోయాడని చెబుతోంది. దాంతో శోభ కి అనుమానం రాకుండా శివలింగ తమ్ముడు తనపై నిఘా పెట్టి ఉంచుతాడు. శోభా రాము దగ్గరగా ఉంటున్నారని తెలుసుకుంటాడు. ఇక పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి విచారణ చేపిస్తాడు. ఇక విచారణలో భాగంగా శోభారాము ఇద్దరూ నిజం చెప్పేస్తారు. దాంతో ఇద్దరికీ యావ జీవకారాగార శిక్ష పడుతుంది.