Rocking Rakesh : జబర్దస్త్ కమెడియన్స్ లో కిర్రాక్ ఆర్పి కూడా ఒకరు.. జబర్దస్త్ వదిలేసిన కిరాక్ ఆర్పి నెల్లూరు చేపల పులుసు బిజినెస్ స్టార్ట్ చేసాడు.. ఈ బిజినెస్ సక్సెస్ ను చూసి ఓర్వలేని కొంతమంది నెగటివ్ ప్రచారం చేస్తున్నారు.. ఇది చాలదన్నట్టు ఆర్ పి పై రాకింగ్ రాకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు..
కిరాక్ ఆర్పి గురించి జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాకింగ్ రాకేష్ దగ్గర కిరాక్ ఆర్పి ప్రస్తావన తీసుకురాగా.. ఆర్పీ గురించి రాకేష్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాకేష్ ఇంటర్వ్యూలో ఆర్పీ గురించి మాట్లాడుతూ.. కిరాక్ ఆర్పి ప్రారంభించిన ఈ చాపల పులుసు బిజినెస్ కూడా జబర్దస్త్ పెట్టిన భిక్ష.. అతడే కాదు మేము అందరం ఇలా ఉండటానికి కూడా జబర్దస్త్ కారణమని చెప్పుకొచ్చాడు.
అంతేకాదు ఆర్పిని ఈమధ్య ఏమైనా కలిశారా అని యాంకర్ అడుగగా.. రాకేష్ మాట్లాడుతూ లేదండి. అంత పెద్ద వాళ్ళని కలిసేంత అదృష్టం నాకు లేదు. మేమేదో చిన్న ఆర్టిస్టులం. వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు అని పరోక్షంగా ఆర్పీని విమర్శించాడు ప్రస్తుతం రాకేష్ చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
కిరాక్ ఆర్పీ చేపల పులుసు వ్యాపారం అభివృద్ధి చెందుతున్న తరుణంలో కొంతమంది కుట్రలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.. ఒక పెయిడ్ బ్యాచ్ తయారయ్యారు. సోషల్ మీడియాలో నా వ్యాపారం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఎంత నెగెటివిటీ స్ప్రెడ్ చేసిన నా వ్యాపారానికి ఏమీ కాదు.. వాళ్ళు చేసే దుష్ప్రచారం నా వ్యాపారానికి మరింత పబ్లిసిటీ తెచ్చిపెడుతుంది అని కిరాక్ ఆర్పి ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు..