Realme C33 : రియల్ మీ C33 స్మార్ట్ ఫోన్ లాంఛ్.. పూర్తి వివరాలు ఇవే..!

Realme C33 : రియల్ మీ వరుసగా బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్ ను తీసుకొస్తుంది .ఈరోజు రియల్ మీ C33 స్మార్ట్ ఫోన్ను రిలీజ్ చేయనుంది. ఇకపోతే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది రియల్ మీ.. ముఖ్యంగా ఆరవ తేదీ అంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు రియల్ మీ C33 స్మార్ట్ఫోన్ లాంచ్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక ఈ విషయాన్ని రియల్ మీ అఫీషియల్ గా చెప్పడంతో కస్టమర్లు సైతం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ లో ఈ ఫోన్ లిఫ్ట్ చేయబడింది. తద్వారా C33 కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్ లు, ఫీచర్లు తెలుసుకుందాం.

ముందుగా కెమెరా విషయానికి వస్తే.. వెనుక సైడ్ రెండు కెమెరాలను అమర్చబడి ఉంచారు .అందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఒకటి ఉంటుంది. ఇక సెల్ఫీ వీడియో షూటర్ కోసం ప్రత్యేకంగా 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. బడ్జెట్ విభాగంలో హైయెస్ట్ ఫిక్సల్ పర్ఫామెన్స్ ను ఈ స్మార్ట్ ఫోన్ ఇస్తుందని రియల్ మీ వెల్లడించింది. ఇక అంతేకాదు 5000 mah బ్యాటరీ కూడా ఉంటుంది అని సమాచారం. ముఖ్యంగా 18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండవచ్చు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే , ఫుల్ హెచ్డి డిస్ప్లే తో రానున్నట్లు రియల్ మీ అధికారికంగా వెల్లడించిందిస్టోరేజ్ వేరియంట్ అలాగే ధర విషయానికి వస్తే..

Realme C33 smartphone launch
Realme C33 smartphone launch

3GB ర్యామ్+ 32 GB స్టోరేజ్ వేరియంట్ ఉండే బేస్ మోడల్ ధర రూ.10,999.. 4GB ర్యామ్+ 64 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999 గా ఉంటుందని తెలుస్తోంది. లాంచ్ సందర్భంగా మొదటి సేల్ లో 1000 రూపాయల వరకు బ్యాంకు కార్డు ఆఫర్ కూడా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది . ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 10, 000 లోపు ధరతోనే కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా మూడు కలర్ ఆప్షన్స్ లో కూడా రియల్ మీ 33 లభిస్తోంది. 187 గ్రాముల బరువు ఉంటుందని చాలా కంఫర్ట్ ఫీలింగ్ ఇస్తుందని కూడా రియల్ మీ స్పష్టం చేసింది. ముఖ్యంగా రియల్ మీ C33 ఫ్లాట్ ఎడ్జెస్ డిజైన్తో వస్తోందని యూనిలివర్ డిజైన్ ని కూడా బ్యాక్ ప్యానెల్ లో కలిగి ఉంటుందని సమాచారం.