R.K.Roja.. తాజాగా రోజా టీడీపీ కార్యకర్తల నోరులేస్తే తాము చేతులతో సమాధానం చెబుతామని మంత్రి ఆర్కే రోజా హెచ్చరించడం ఇప్పుడు సంచలనానికి దారితీస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసే మంచి పనులను ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆమె మండిపడ్డారు.. జగన్మోహన్ రెడ్డి 18 మందికి ఎమ్మెల్సీలు ఇస్తే .. అందులో 14 మంది బీసీ ,ఎస్సీ, మైనారిటీ కులాల వారికి ఎమ్మెల్యే పదవులు ఇచ్చి వారిని గౌరవించడం జరిగింది. వెనుకబడిన కులాల వారికి ఎమ్మెల్సీల పదవులు ఇవ్వడం చూసి ఓర్వలేని చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ఎలా చేస్తున్నారు రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు అంటూ ఆమె తెలిపారు.
ఇకపోతే గన్నవరం ఘటనపై చంద్రబాబు నాయుడు మరికొందరు నాయకులు హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారని పోలీసులు గూండాలుగా ప్రవర్తించారని.. దౌర్జన్యం చేశారని.. వైసీపీ గుండాలు రెచ్చిపోయారని.. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దౌర్జన్యం, గూండాయిజం, సైకోయిజంకు కేరాఫ్ అడ్రస్ గా చంద్రబాబు నాయుడు టిడిపి నేతలు ఉన్నారంటూ రోజా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మండిపడ్డారు. మొత్తానికి అయితే రోజా టిడిపి కార్యకర్తలపై , టీడీపీ అధినేతపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు మరింత సంచలనాలకు దారి తీస్తున్నాయి.