Pudina: పుదీనా ఆకులు చర్మ ఆరోగ్యానికి చాలా సహాయపడతాయి. ముఖ అందానికి వాడే చర్మ సంరక్షణ ఉత్పత్తులకు దీనిని వాడుతారు. పుదీనా ఆకులలో చర్మానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి, అందుకే ఇవి చర్మ సంరక్షణకు చాలా బాగా పనిచేస్తాయి. పుదీనా ఆకులు యాంటీ బాక్టీరియల్ గుణాలు కలిగి ఉండటం వల్ల చర్మానికి క్లెన్సర్, టోనర్, మాయిశ్చరైజర్‌గా సహాయపడతాయి.
Pudina: 1.పింపుల్స్ తగ్గించడంలో :
పుదీనా ఆకులలో సాలిసిలిక్ యాసిడ్, విటమిన్ ఎ అధికంగా ఉండటం వల్ల,చర్మంలో ఆయిల్ గ్లాండ్స్ క్రమంగా పనిచేసేలా చేస్తాయి. జిడ్డు చర్మం ఉన్న వ్యక్తులు మొటిమల సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు పుదీనా ఆకులను బాగా శుభ్రం చేసి తేనే కలిపి మిశ్రమం లా తయారుచేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇందులో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు మచ్చలను తగ్గిస్తుంది. చర్మ రంధ్రాలను కూడా శుభ్రపరుస్తుంది.
2. అలర్జీలను తగ్గిస్తుంది.
పుదీనాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కళంగా ఉండటం వల్ల,చర్మంపై కోతలు, దోమ కాటు, దురద వంటి అలర్జీ లను తగ్గిస్తుంది. దీని కోసం పుదీనా ఆకుల రసాన్ని అలర్జి వచ్చిన చోట అప్లై చేయాలి. ఇది అలర్జీ కరకాలను నాశనం చేస్తుంది. చికాకు నుంచీ ఉపశమనం కలిగిస్తుంది.
3. చర్మాన్ని తేమగా ఉంచుతుంది
పుదీనా ఆకులు లైట్ ఆస్ట్రిజెంట్‌గా పనిచేసి చర్మ రంధ్రాల నుంచి మురికిని తొలగించి చర్మాన్ని తేమగా ఉంచడంలోను మరియు,చర్మంలో రక్త ప్రసరణను పెంచడంలోను చాలా బాగా ఉపయోగపడతాయి.ఇది కాకుండా చర్మంపై ముడుతలను, గీతలను నివారిస్తుంది. ఇలాంటి సమస్యలు వున్నవారు పుదీనా ఫేస్ ప్యాక్‌ను అప్లై చేసి 20 నుంచి 25 నిమిషాల పాటు అలాగే ఉంచి, తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి ఒకసారి చేస్తే ముఖము అందంగా తయారవుతుంది.
4. కళ్ల కింద వలయాలను తగ్గిస్తుంది..
పుదీనా ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల, కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించడంలో సహాపడుతాయి. దీని కోసం మీరు పుదీనా గుజ్జును కళ్ల కింద రాసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే శుభ్రం చేయాలి.ఇది కళ్ల కింద నల్లటి వలయాలకు ఉపశమనం కలిగిస్తుంది.
5. చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది.
పుదీనా ఆకులలో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉంటాయి. ఇది సూర్యుని హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. పుదీనా ఆకులను చర్మం ప్రకాశవంతంగా తయారవడానికి ఉపయోగపడుతుంది.