Premi Viswanath..రెండు తెలుగు రాష్ట్రాలలో బుల్లితెర సీరియల్స్ లో రారాజుగా ఒక గుర్తింపు తెచ్చుకున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సీరియల్ తో డాక్టర్ బాబు, వంటలక్క అనే క్యారెక్టర్లు ప్రేక్షకుల మనసులకు బాగా హత్తుకుపోయాయి. అయితే గత నెల రోజుల క్రితం కార్తీక దీపం సీరియల్ ముగిసిపోయిందని.. కానీ త్వరలోనే సీక్వెల్ తో వస్తామని సీరియల్ యూనిట్ స్పష్టం చేశారు. అయితే ఇలా ప్రకటించి దాదాపు రెండు నెలలు అవుతున్నప్పటికీ ఇంకా సీరియల్ పై ఎటువంటి అప్డేట్ రాలేదు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీరియల్ లో లీడ్ రోలు పోషిస్తున్న ప్రేమీ విశ్వనాథ్ కి చర్మ సంబంధిత వ్యాధి వచ్చిందట.
కార్తీకదీపం సీరియల్ కోసం ఆమె ఎక్కువగా నల్లటి మేకప్ వేసుకోవడం వల్లే అది వికటించి చర్మ సంబంధిత వ్యాధులు వచ్చినట్లు తెలుస్తోంది. చర్మం మొత్తం నల్లటి మచ్చలతో వికారంగా మారిపోయిందట . ఇక ప్రేమీ విశ్వనాథకు ఈ సమస్య తగ్గే వరకు కార్తీక దీపం టు సీరియల్ ప్రారంభం కాదు అని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ విషయం అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ లాంటిది అని చెప్పవచ్చు.