Oscar Award 2023 : ఆస్కార్ అవార్డుల వేడుక లైవ్ స్ట్రీమింగ్.. ఈ ఓటీటీ లోనే..!

Oscar Award 2023: సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ ప్రతి యేటా అత్యంత ప్రతిభ కనబరిచిన నటీనటులకు సినిమాలకు అవార్డును ప్రధానం చేస్తుంటారు. ఈ ఏడాది కూడా ఆస్కార్ అవార్డుల వేడుకకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ అవార్డు సందడి మొదలైంది. మార్చ్ 12వ తేదీన జరగబోయే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ సెలబ్రిటీలంతా అమెరికాకు క్యూ కడుతున్నారు. ఈసారి మన తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే.

Is Oscar Awards a scam? - Quora

దీంతో భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఈ అవార్డు కార్యక్రమం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వారందరినీ సర్ప్రైజ్ చేసే ప్రకటన ఒకటి బయటకు వచ్చింది. ఈ ఏడాది జరిగే 95వ ఆస్కార్ అవార్డు ఈవెంట్ ను లైవ్ లో చూసే అవకాశం కల్పించేందుకు సన్న హాలు చేస్తోంది ప్రముఖ ఓటిటి సంస్థ. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో ఆస్కార్ అవార్డు ఈవెంట్ ను లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది. నిన్న సోమవారం దీనిపై హాట్ స్టార్ అధికారిక ప్రకటన ఇస్తూ మార్చి 13 ఉదయం 5:30గంటల నుంచి హాట్ స్టార్ లైవ్ లో స్ట్రీమింగ్ కానున్నట్టు ఈ సందర్భంగా తెలిపింది.