సాధారణంగా ఒకప్పుడు టెలిఫోన్ రంగంలో ఒక వెలుగు వెలిగిన నోకియా.. కాలం మారుతున్న కొద్ది టెక్నాలజీకి అనుగుణంగా ఎన్నో స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత నోకియా ఫోన్లకు పూర్తిస్థాయిలో డిమాండ్ తగ్గిపోయింది అందుకే మార్కెట్లో స్మార్ట్ ఫోన్ లకు పోటీగా నిలదొక్కుకోలేకపోవడం జరిగింది. ఇక పోతే ఆ తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్లను కూడా విడుదల చేస్తూ మళ్ళీ మార్కెట్లో తన సత్తా చాటింది నోకియా. ఇక ఈ క్రమంలోని ఎప్పటికప్పుడు సరికొత్త ఫోన్లను విడుదల చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఫ్యూచర్ ఫోన్లను కూడా తీసుకొస్తూ ఉండడం గమనార్హం.
ఇక తాజాగా నోకియా మరో బడ్జెట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చే పనిలో చాలా బిజీ అయిందని చెప్పాలి నోకియా 2660 ఫ్లిప్ పేరుతో ఫోల్డింగ్ ఫోన్ ను నిన్న మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటివరకు నోకియా నుంచి అందుబాటులోకి వచ్చిన పోల్డబుల్ ఫోన్లు అన్ని భారీ బడ్జెట్ తో కూడుకున్నవి కాగా ఈ కొత్త ఫోన్ మాత్రం బడ్జెట్ ధరలోనే అందుబాటులోకి రావడం గమనార్హం. ఇక ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కాకుండా ప్రత్యేక కాయ్ ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది. ఇందులో రెండు డిస్ప్లే ఉంటాయి. ఫ్లిప్ తెరిచినప్పుడు పై భాగంలో 2.8 ఇంచెస్ QVGA డిస్ప్లేను అందించారు ఇక మూసినప్పుడు ముందు భాగంలో 1.77 ఇంచెస్ QQBGA స్క్రీన్ ని కూడా అందిస్తున్నారు.
4G నెట్వర్క్ కి సపోర్ట్ చేసే ఈ ఫోన్లో మీకు 2.75 W ఛార్జింగ్ సపోర్టుతో 1450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ కూడా అందిస్తున్నారు. ఇక నోకియా అందిస్తున్న ఈ ఫ్లిప్ మొబైల్ ధర కేవలం రూ. 4, 500 మాత్రమే. ఒకసారి చాట్ చేస్తే ఏడు గంటల పాటు వాడుకోవచ్చు. ఇక ఫ్లాష్ లైట్ తో కూడిన కెమెరా , ఎఫ్ఎం రేడియో, ఎంపి 3 ప్లేయర్ వంటి ఫీచర్లు అందిస్తున్నారు. అంతేకాదు స్టోరేజ్ విషయానికి వస్తే 32GB మెమొరీ కార్డు కు సపోర్ట్ చేసే ఈ ఫోన్ ను 48 MB ర్యామ్ అలాగే 128 MB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ తో లభిస్తుంది. ఇకపోతే తక్కువ ధరలో ఫీచర్ల కోసం ఎదురుచూసే వారికి ఈ స్మార్ట్ ఫోన్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అది కూడా తక్కువ ధరకు లభిస్తూ ఉండడం గమనార్హం.