Sudheer – Rashmi : గుండె బద్దలయ్యే న్యూస్ చెప్పిన రష్మీ.. సుధీర్ తో బ్రేక్ అప్..

Sudheer – Rashmi :  వెండి తెరపై సమంత నాగచైతన్య జంట ఎంత క్రేజ్ సంపాదించుకుందో.. బుల్లితెరపై సుడిగాలి సుదీర్ యాంకర్ రష్మీ జంట కూడా అంటే పాపులర్.. ఈ జోడీ కలిసి షోస్ ఎంత హిట్ అయ్యాయో.. అంతకు డబుల్ వీళ్ళిద్దరూ పాపులర్ అయ్యారు. సుధీర్ రష్మి బ్రేకప్ అయినట్లు తెలుస్తుంది. అందుకు కారణం కూడా లేకపోలేదు..

Is rashmi Sudigali Sudheer breakup
Is rashmi Sudigali Sudheer breakup

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం ప్రసారం కానున్న ప్రోమో విడుదలైనది.. వాలంటైన్స్ డే సందర్భంగా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో ఆది ప్రేమ ప్రేమంటే గెలవడం కాదని గెలవడం అంటూ పంచ్ కుళ్ళు డైలాగ్స్ వేయడంతో అంతా నవ్వుతారు. అంతలో రష్మీ ఫిబ్రవరి 14వ తేదీ కాబట్టి ఒకరికి గట్టిగా ఒకటి ఇవ్వాలని అనుకుంటున్నాను అని రేష్మి చెప్పగానే.. అది నాకు ఇచ్చేయండి .. తనకి నేను ఇచ్చేస్తా అది హైపర్ ఆది అంటాడు..

రష్మీ ఇంతకీ బాబుకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చావా అని వెంటనే.. బాబుకి గిఫ్ట్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ.. ఏదో ఒక రోజు బాబును ఇవ్వడం లాంటిది మాత్రం చేయకు అంటూ హైపర్ ఆది పంచ్ చేస్తాడు.. ఇక వాలంటైన్స్ డే కావడంతో రాకేష్ సుజాత జంట తోపాటు శ్రీదేవి డ్రామా కంపెనీలోని మరి కొంతమంది జంటలు కూడా స్టేజిపై అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేస్తారు..

వర్ష ఇమ్మానుయేల్ పేర్లతో FLAMES చెక్ చేస్తే మ్యారేజ్ అని వస్తుంది. ఇక్కడ పరదేశి వర్షా కి కూడా మ్యారేజ్ అని వచ్చింది అంటూ నరేష్ ఝలక్ ఇస్తాడు. అంతలో ఆది పేపర్ పెన్ పట్టుకుని బోర్డ్ మీద రష్మీ అని రాసి.. నీ పేరుతో ఎవరితో చూడను అంటూ సిద్దు అని రాయబోతుండగా.. రష్మీ ఆ పేపర్ ని ఏడుస్తూ చించేస్తుంది..

సుధీర్ నిక్ నేమ్ సిద్దు.. రష్మీ ఏడుస్తూ ఆ పేపర్ ని చింపేస్తుండగా బ్యాక్ గ్రౌండ్ లో బ్రేకప్ అని కనిపిస్తుంది. దాంతో ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ వీడియో కొన్ని లక్షల వ్యూస్ అందుకుంది. వీళ్ళ బ్రేకప్ అడ్డం పెట్టుకొని ప్రోమో హైలైట్ చేశారు.. ప్రతిసారి ఇలాంటిది ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఈసారి సుధీర్ రష్మీతో ఆడుకున్నారు. అంటూ వాళ్ళ ఫ్యాన్స్ ఈ ప్రోమో పై మండిపడుతున్నారు మరోవైపు ఇది నిజమేనేమో అని ఆలోచనలో పడుతున్నారు. వీళ్లిద్దరూ కలిసి ఉండాలని వాళ్ళ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.