కేంద్ర బడ్జెట్ : ఎంత జీతానికి ఎంత పన్ను కట్టాలి , మొత్తం లెక్కలు ఇవే..

కేంద్ర బడ్జెట్ : 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి అమృత కాలంలో తొలి బడ్జెట్ ఇదేనని నిర్మలా సీతారామన్ తెలిపారు.. గత బడ్జెట్‌లో వేసిన పునాదిలపై నిర్మాణానికి ఇది సహకరిస్తుందని భావిస్తున్నామని అన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేశారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ఉన్నతే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించామని అన్నారు.

Income tax slabs union Budget 2023
Income tax slabs union Budget 2023

ఆదాయపు పన్నులో ఐదు స్లాబ్‌ లలో వేతన జీవులకు ఊరటనిచ్చేలా పన్ను మినహాయింపు ఇచ్చారు. రూ.7 లక్షలోపు ఆదాయం ఉన్న వారికి ఎటువంటి పన్ను విధించలేదు. కాగా.. ఈ విధానం కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. రూ.3 నుంచి రూ.6 లక్షల వరకూ 5 శాతం, రూ.6 నుంచి రూ. 9 లక్షల వరకూ 10 శాతం, 9 లక్షల నుంచి 12 లక్షల వరకూ 15 శాతం, రూ.12 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ 20 శాతం విధించారు. గతంతో పోలిస్తే పన్ను రాయితీలు ప్రయోజనకరంగా ఉన్నాయి.

 

తొమ్మిదేళ్లలో దేశంలో తలసరి ఆదాయం రెట్టింపయ్యిందని.. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ నిలిచిందన్నారు. కరోనా సమయంలో ఎవరూ ఆకలితో బాధపడకుండా చూశామన్నారు. అనేక రంగాల్లో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించామని అన్నారు. సామాజిక భద్రత, డిజిటల్ పేమెంట్స్‌లో పురోగతి సాధించామని తెలిపారు.

 

ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగుతుందని అన్నారు. తాజా బడ్జెట్ ప్రకారం సిగరెట్లు, బంగారం, వెండి, వజ్రాల ధరలు పెరగనుండగా.. టీవీలు, మొబైల్స్, కెమెరాల ధరలు తగ్గనున్నాయి.