ఇప్పుడున్న ఆహార అలవాట్లు, పొల్యూషన్ వల్ల జుట్టు ఆరోగ్యం బాగా దెబ్బతింటోంది. పూర్వం ప్రతి ఒక్కరి జుట్టు ఆరోగ్యాంగా, అందంగా ఉండేది. కారణం వారి మంచి ఆరోగ్య అలవాట్లు మరియు ఎన్నో ఇంటి చిట్కాలు వాడేవారు. మనము కూడా అలాంటి ఆరోగ్యాకరమైన చిట్కాలు వాడి ఆరోగ్యకరమైన, ఒత్తయిన జుట్టు సొంతం చేసుకోవచ్చు. అందులో ఈ ప్రోటీన్ ప్యాక్స్ చాలా బాగా ఉపయోగపడతాయి.అవేంటో ఇప్పుడు చూద్దాం.
కొబ్బరి పాల హెయిర్ ప్యాక్..
ఒక కప్పు కొబ్బరి పాలు తీసుకొని అందులో ఒక అరటిపండును ముక్కలుగా చేసి తీసుకోవాలి. దానిని బాగా మిక్స్ చేసి కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి,అరగంట సేపు ఆరానివ్వాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇందులో ఫాస్పరస్ మరియు ప్రొటీన్లు అధికంగా ఉండటం వల్ల ఇది పొడిబారి తెబ్బతిన్న జుట్టును రిపేర్ చేస్తుంది.
మెంతి హెయిర్ మాస్క్:
జుట్టుకు మెంతులు బాగా ఉపయోగపడతాయి. మెంతి హెయిర్ ప్యాక్ కి 2 స్పూన్ల మెంతిగింజలను రాత్రి పూట నానబెట్టి,ఉదయాన్నే పేస్ట్ లాగా చేసి..అందులో పెరుగు కానీ,గుడ్డు కానీ వేసి మిక్స్ చేసుకొని తలకు బాగా మర్దన చేయాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో స్నానం చేసి కండిషనర్ వాడాలి.మెంతిలో ప్రోటీన్ మరియు లెసిథిన్ ఉంటాయి. ఇవి చుండ్రు నివారణకు, జుట్టు దృఢత్వానికి బాగా ఉపయోగపడతాయి.
తేనే మరియు గుడ్డు హెయిర్ ప్యాక్
తేనే మరియు గుడ్డు మంచి ప్రోటీన్ కలిగిన పుడ్. ఇది జుట్టు ఒత్తుగా, ఆరోగ్యకరముగా పెరగడానికి అసలైన చిట్కా అని చెప్పొచ్చు. ఒక గుడ్డు బాగా గిలక్కోట్టి అందులో మూడు టేబుల్ స్ఫూన్ లా తేనే కలిపి, ఆ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి బాగా మర్దన చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల పొల్యూషన్ కి పాడయినా జుట్టును రిపేర్ చేసి,జుట్టు అందంగా పెరగడానికి సహాయం చేస్తుంది.
అవకాడో మాస్క్..
అవకాడో శరీర ఆరోగ్యానికే కాక జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక అవకాడో తీసుకొని మిక్స్ చేసి, అందులో గుడ్డు మాయన్నెస్ కలిపి జుట్టు ప్యాక్ గా వేసి, అరగంట సేపు ఆరానివ్వాలి. ఆ తర్వాత షికాయతో స్నానం చేయడం వల్ల జుట్టు అందంగా, ఆకర్షనియంగా పెరగడానికి తోడ్పడుతుంది.
పైన చెప్పిన ప్రోటీన్ మాస్క్ లు వారానికి ఒకసారైనా వేసుకొని ఒత్తయినా, ఆరోగ్య కరమైన జుట్టును పొందండి.