Farmers : సాగుకి పెట్టుబడి ఎట్లా అని బెంగ పడే పని లేదు.. అదును దాటి పోతుందని ఆందోళన అక్కర్లేదు.. పంట సీజన్ ప్రారంభానికి ముందే ప్రభుత్వ సాయం ఖాతాలో పడిపోతుంది.. రైతు సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కించినా రైతుబంధు ద్వారా మరో విడత పెట్టుబడి సాయం అందించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం..
రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు చెమ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రైతుబంధు సంబరం కొనసాగుతుంది.. రైతుబందు కింద పదో విడత నిధులు రైతు ఖాతాల్లోకి డిపాజిట్ అవుతున్నాయి. యాసంగి పెట్టుబడి సాయం కింద 7500 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. రైతు బంధు సాయాన్ని నేరుగా రైతుల ఖాతాలోకి జమ చేస్తున్నారు.
అయితే ముందుగా ఒక ఎకరం ఉన్న రైతుల ఖాతాలోకి జామ చేస్తున్నారు. ఆ తరువాత రెండు ఎకరాలలోపు పొలం ఉన్నవారికి.. ఆపై మూడు ఎకరాల లోపు పొలం ఉన్నవారికి.. విడతల వారీగా నగదు జమ చేస్తున్నారు. ఈ మొత్తాన్ని బ్యాంక్ ఎటిఎం ద్వారానే కాకుండా పోస్ట్ ఆఫీస్ ల నుంచి కూడా పొందవచ్చు.
మొత్తం 59.32 లక్షల మంది రైతుల పేర్లు ఆన్లైన్లో ఉన్నట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి. కరోనా నేపథ్యంలో ఈ సీజన్ నుంచి వ్యవసాయ శాఖ కొత్త ప్రయోగం చేస్తోంది. రైతు బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ కాగానే అతని ఫోన్ కి సందేశం వస్తుంది. వెంటనే ఆధార్ బ్యాంకు పుస్తకం తీసుకొని పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళు రైతుకి సొమ్ము ఇచ్చేలాగా ఏర్పాట్లు చేశారు. రైతుబంధు కింద ఒక సంవత్సరానికి 10000 జమవుతాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా రెండుసార్లు జమవుతాయి. అయితే ఈ రైతు బంధు పథకానికి అర్హులు అయి ఉండి డబ్బులు రాకపోతే గనుక సంబంధిత అధికారులను సంప్రదించాలని.. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ డబ్బులు వస్తాయని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. మీ అకౌంట్లో డబ్బులు పడకపోతే సంబంధిత అధికారులను కలిసి మీ వివరాలు ఉన్నాయో లేదో తెలుసుకోమని అధికారులు తెలిపారు.