H3N2 Virus: దేశంలో కలకలం సృష్టిస్తున్న కొత్త వైరస్.. లక్షణాలివే..!

H3N2 Virus.. ప్రపంచ దేశాల ప్రజలు కరోనా మహమ్మారి నుంచి క్రమంగా కోరుకుంటున్న వేళ ఇప్పుడు హెచ్3ఎన్2 అనే కొత్త వైరస్ దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. జ్వరం, ఫ్లూ లక్షణాలతో కూడిన ఈ వైరస్ బారిన జనం పడుతూ మరింత భయభ్రాంతులకు గురి అవుతున్నారు.. పైకి జ్వరం, జలుబుగా మాత్రమే కనిపిస్తున్న ఈ వైరస్ పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తో పాటు కేంద్రం కూడా ఇవాళ అడ్వైజరీలు విడుదల చేశాయి. దేశంలోని పలు రాష్ట్రాలలో హెచ్3ఎన్2 వైరస్ కేసులు బాగా పెరిగిపోతున్నాయి. జ్వరం , జలుబు, దగ్గు , గొంతు నొప్పి వంటి వైరస్ లక్షణాలతో వందల సంఖ్యలో జనం ఆసుపత్రిలో చేరుతున్నట్లు సమాచారం.

H3N2 is the new wily virus driving people to hospitals | Mumbai news -  Hindustan Times

అయితే ఫ్లూ కేసుల తీవ్రత రాష్ట్రాలలో ఎక్కువగా ఉండగా.. మరికొన్నిచోట్ల ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఇకపోతే ఈ వైరస్ లక్షణాలు సాధారణ జ్వరంతోపాటు నిరంతరాయంగా దగ్గును కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్ తగ్గేందుకు చాలా సమయం తీసుకుంటున్నట్లుగా కూడా గుర్తించారు. కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తం కావాలి అని దగ్గు, జలుబు వచ్చిన వెంటనే హాస్పిటల్ కి వెళ్లి చికిత్స తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది..