Categories: ExclusiveFeatured

Bala Gangadhar Tilak : చరిత్ర నిజాలు : బాల గంగాధర్ తిలక్ ఎంత గొప్ప మనిషో తెలుసుకోండి !

Bala Gangadhar Tilak : గంగాధర్ తిలక్ బాల్యం:
1856 జూలై 23 న కేశవ్ గంగాధర్ తిలక్ ప్రస్తుతం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ప్రధాన కార్యాలయమైన రత్నగిరిలోని మరాఠీ హిందూ చిట్పావన్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. ఆయన పూర్వీకుల గ్రామం చిఖాలి.అయన తండ్రి ఆయన తండ్రి గంగాధర్ రామచంద్ర తిలక్ పాఠశాల ఉపాధ్యాయుడు, సంస్కృత పండితుడు కూడా. తిలక్ తండ్రి తిలక్ కి పదహారేళ్ళ వయసు ఉన్నప్పుడు మరణించారు. తిలక్ 1871 లో, తన తండ్రి మరణానికి కొన్ని నెలల ముందు, పదహారేళ్ళ వయసులో తాపిబాయి తో వివాహం జరిగింది. వివాహం తరువాత, ఆమె పేరు సత్యభాబాయిగా మార్పు చేయబడింది. 1877 లో తిలక్ పూణేలోని డెక్కన్ కాలేజ్ నుండి గణితంలో ఫస్ట్ క్లాస్ లో తన బ్యాచిలర్ ఆర్ట్స్ లో ఉత్తీర్ణుడు అయ్యాడు. తన బాల్యంలో తిలక్ చురుకైన విద్యార్థి గా ఉన్నారు. ప్రత్యేకించి గణితశాస్త్రంలో ఆయనగొప్ప ప్రతిభావంతుడు.

Bala Gangadhar Tilak :నిజాయితీ ,ముక్కుసూటితనం:

చిన్న తనం నుంచి అన్యాయం ఎక్కడ జరిగినా సహించ లేని గుణం కలిగినవాడు. నిజాయితీతో బాటు ముక్కుసూటితనం ఆయనకు పుట్టుకతోనే వచ్చాయి. కళాశాలకు వెళ్ళి ఆధునిక విద్యనభ్యసించిన తొలితరం భారతీయ యువకుల్లో ఆయన కూడా ఒకరు.
తరువాతఅయన L.A.B కోర్సులో చేరడానికి తన M.A. కోర్సునువదిలివేయవలిసి వచ్చింది. 1879 లో ఆయన ప్రభుత్వ లా కాలేజీ నుండి తన L.L.B డిగ్రీని పొందారు. గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తరువాత, తిలక్ పూణేలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో గణితం చెప్పడం మొదలు పెట్టారు. తరువాత, పాఠశాలలో సహోద్యోగులతో సైద్ధాంతిక విభేదాల రావడం తో ,అక్కడ మానేసి జర్నలిస్ట్ అయ్యారు . తిలక్ ప్రజా వ్యవహారాల్లో చాలా చురుకుగా పాల్గొనేవారు.

 

Bala Gangadhar Tilak : ప్రజలకు మంచి విద్య:

1880 లో గోపాల్ గణేష్ అగార్కర్, మహాదేవ్ బల్లాల్ నమ్జోషి,, విష్ణుశాస్త్రి చిప్లుంకర్లతో సహా తన కాలేజ్ ఫ్రెండ్స్ తో కలిసి సెకండరీ విద్య కోసం న్యూ ఇంగ్లీష్ పాఠశాలను మొదలు పెట్టారు. తిలక్ పాశ్చాత్యవిద్యావిధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిచారు. అది భారతీయ సాంస్కృతికవారసత్వాన్ని అగౌరవపరచి భారతీయ విద్యార్థులను చిన్నబుచ్చేవిధంగా ఉందని ప్రజలకు మంచి విద్యను అందించడం వలన మాత్రమే వాళ్ళను మంచి పౌరులుగా మార్చవచ్చనే నిర్ణయానికి వచ్చారు. భారత దేశం లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికీ భారతీయ సంస్కృతి గురించి, భారతదేశపు ఔన్నత్యాన్ని గురించి బోధించాలనేదేది అయన ఆశయం. అందుకే దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ”ని స్థాపించాడు. . భారతీయ సంస్కృతికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారాభారతీయ యువతకు జాతీయవాద ఆలోచనలను నేర్పించే కొత్త విద్యావ్యవస్థను రూపకల్పన చేసారు. పోస్ట్-సెకండరీ అధ్యయనాల కోసం సొసైటీ 1885 లో ఫెర్గూసన్ కాలేజీని ఏర్పాటు చేసింది. తిలక్ ఫెర్గూసన్ కాలేజీలో గణితం చెప్పేవారు. 1890 లో, తిలక్ బహిరంగ రాజకీయ పనుల కోసం మరింత సమయం వెచ్చించడానికి దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని విడిచి పెట్టవలిసి వచ్చింది.
స్వాతంత్ర్యం వైపు:అయన మత మరియు సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా స్వాతంత్ర్యం వైపు ఒక పెద్ద ఉద్యమాన్ని మొదలు పెట్టారు.

Bala Gangadhar Tilak : మొద్దు నిద్రలో ఉన్న భారతీయులను :

తిలక్ రెండు వారపత్రికలను ప్రారంభించారు. మొద్దు నిద్రలో ఉన్న భారతీయులను మేల్కొల్పడానికి పదునైన భాషలో బ్రిటిష్ పాలనలోని వాస్తవ పరిస్థితుల గురించి వివరించసాగాడు. బాల్యవివాహాలను వ్యతిరేకిస్తూ వితంతు వివాహాలను ప్రోత్సహించాడు.
మరాఠీలో కేసరి మరియు ఆంగ్లంలో మహారాష్ట్ర 1880–81లో గోపాల్ గణేష్ అగార్కర్ మొదటి సంపాదకుడిగా ఉండడం వలన దీని ద్వారా ఆయన ‘భారతదేశం యొక్క మేల్కొలుపు’ గా భావించబడ్డారు. కేసరి తరువాత రోజుల్లో దినపత్రికగా మారడమే కాదు ఈ రోజు వరకు ప్రచురణను కొనసాగిస్తూనే ఉంది. 1894 లో తిలక్ ఇంటికే పరిమితమైన గణేష్ ఆరాధనను గొప్ప బహిరంగ కార్యక్రమంగా మార్చడం జరిగింది. ఈ వేడుకలలో ఊరేగింపులు , సంగీతం మరియు ఆహారం వంటివి చేర్చబడ్డాయి. మొట్టమొదటిసారిగా శివాజీ ఉత్సవాలను, గణపతి ఉత్సవాలను పెద్ద ఎత్తున జరపడం ద్వారా ప్రజలను సమీకరించడం, వారిని జాతీయోద్యమం వైపు నడిచేలా చేయడం అనేది మొదలు పెట్టారు. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు శివాజీ జన్మదినం “శివ జయంతి” వేడుకల కోసం 1895 లో తిలక్ శ్రీ శివాజీ ఫండ్ కమిటీని ఏర్పాటు చేసారు. రాయ్‌గడ్ కోట వద్ద శివాజీ సమాధి పునర్నిర్మాణానికి నిధులు సమకూర్చడం కూడా ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం.

Bala Gangadhar Tilak :భారతజాతీయోద్యమ పిత:

తిలక్ ను భారతజాతీయోద్యమ పితగా చెబుతారు. ఆయనకు ముందు జాతీయోద్యమం లేదని దీని అర్ధం కాదు కానీ తిలక్ జాతీయోద్యమాన్ని కొత్తదారులలో నడిపించారు. దేశవ్యాప్తంగా ఉన్న సామాన్యప్రజల్ని సైతం ఆ ఉద్యమంలో పాల్గొనేటట్లు చేయడంలో ఆయన పాత్రఅద్భుతమైనది. ఈ కారణం గానే తిలక్ ను భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేగిన అశాంతికి మూలకారకుడు గా భావిస్తారు.

Bala Gangadhar Tilak :  లోకమాన్య అనే బిరుదు:

ఈయనకు లోకమాన్య అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది.తిలక్ 1890లో కాంగ్రెస్ లో సభ్యుడుగా చేరిన కొద్దీ రోజులకే ఆయనకు కాంగ్రెస్ మితవాద రాజకీయాలపై నమ్మకం పోయింది. స్వరాజ్యం కోసం పోరాటమే సరైన మార్గమని తిలక్ నమ్మారు. అప్పటివరకు కాంగ్రెస్ ప్రతి సంవత్సరం డిసెంబరు చివరివారంలో మూడు రోజులపాటు సమావేశాలు జరిపి బ్రిటిష్ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడానికి పరిమితమైంది. తిలక్ దాని గురించి చాలా ఘాటైన విమర్శలు చేసారు మీరు సంవత్సరానికొకసారి మూడు రోజులపాటు సమావేశమై గందరగోళం గా మాట్లాడటం వలన ఎటువంటి ప్రయోజనం లేదు అని అనడం తో పాటు అసలు కాంగ్రెస్ సంస్థ అనేది అడుక్కునేవాళ్ళ సంఘం అని అన్నారు.

Bala Gangadhar Tilak : స్వరాజ్యం నా జన్మహక్కు:

స్వరాజ్యం నా జన్మహక్కు. దాన్ని నేను పొందే తీరుతాను.” అని సింహగర్జన చేసారు. 1907 మహారాష్ట్రలోని సూరత్‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ చీలిపోయింది. మితవాదులు కాంగ్రెస్ పై తమ పట్టును నిలబెట్టుకున్నారు అనే చెప్పాలి. అతివాదులుగా పిలవబడే తిలక్, ఆయన మద్దతుదారులు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేయడం అనేది జరిగింది. తిరిగి మరల 1916లో లక్నోలో జరిగిన ఒక సమావేశంలో అంతా ఒకటయారు. అదే సమావేశంలో కాంగ్రెస్ కు, ముస్లిం లీగుకు మధ్య లక్నో ఒప్పందం కుదరడం అనేది జరిగింది.

కారాగారశిక్ష :

భారతీయులలో జాతీయస్ఫూర్తిని రగల్చడానికి వీలున్న ఏ అవకాశాన్నీ ఆయన జారవిడుచుకోలేదు. తన పత్రికల్లో ప్రజలను రెచ్చ కొట్టే విధం గా రాసినందుకు 1897లో ఆయనకు ఒకటిన్నరేళ్ళు కారాగారశిక్ష పడింది. విధించారు. జైలు నుండి విడుదలయ్యాక ఆయన స్వదేశీ ఉద్యమాన్ని మొదలు పెట్టారు. మరల 1906లో దేశద్రోహం నేరం క్రింద ఆయనకు ఆరేళ్ళు ప్రవాసశిక్ష వేయబడింది. కారాగారంలో ఉన్నరోజుల్లో ఆయన గీతారహస్యం అనే పుస్తకం రాశారు .

1916 వ సంవత్సరం లో ఏప్రిల్ లో హోంరూల్ లీగ్ను స్థాపించి దాని లక్ష్యాలను వివరిస్తూమధ్యభారతదేశంలో ఉన్న గ్రామగ్రామానా తిరిగారు. అనీబిసెంటు అదే సంవత్సరం సెప్టెంబర్లో మొదలుపెట్టి హోంరూల్ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసింది. ఆ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుంది అన్న సమయంలో ఒక కోర్టుకేసు నిమిత్తం ఆయన లండనుకు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడే 1917 ఆగస్టులో అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మాంటేగు “బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమైన భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి వీలుగా అన్ని పాలనాంశాల్లో భారతీయులకు అధిక ప్రాధాన్యాన్నివ్వడమే ప్రభుత్వ విధానమని బ్రిటిష్ ప్రభుత్వం తరపున ప్రకటన చేసాడు. బాధ్యతాయుత ప్రభుత్వమంటే ఎవరికి బాధ్యత వహించే ప్రభుత్వమో, అధిక ప్రాధాన్యమంటే ఎంత ప్రాధాన్యమో, అసలు అది ఎప్పుడిస్తారోఆ విషయాలలో ఎలాంటి స్పష్టత లేదు. కానీ బ్రిటిష్ ప్రభుత్వ నిజాయితీని నమ్మిన అనీబిసెంటు ఆ ప్రకటన తర్వాత ఉద్యమాన్ని అపేసి ప్రభుత్వానికి తన మద్దతు తెలియచేసింది. అలా హోంరూల్ ఉద్యమంనీరుకారిపోయినది.అయితే ప్రజల్లో తిలక్ రగిలించిన స్ఫూర్తి మాత్రం అలాగే కొనసాగింది.

Bala Gangadhar Tilak : మరణం :

1920లో ఆగస్టు 1 న తిలక్ మరణించినప్పుడు జాతీయోద్యమం చుక్కాని లేని నావ అవుతుందని చాలా మంది భావించారు. గాంధీ ఉన్నాడు గానీ తిలక్ ముందర ఏపాటి?” అనుకున్నారు అందరు. కానీ నాయకులు చరిత్రను సృష్టించలేరు. చరిత్రే నాయకులను సృష్టిస్తుంది. అనే మాటను నిజం చేస్తూ అతి సామాన్యుడిగా జీవితం ప్రారంభించిన గాంధీ తిలక్ మరణంతో ఏర్పడ్డ శూన్యాన్ని పూర్తిగా భర్తీ చెయ్యడమే గాక మహాత్ముడి స్థాయికి ఎదిగేలా చేసింది.

Bala Gangadhar Tilak :ది మేకర్ ఆఫ్ మోడరన్ ఇండియా:

కేశవ్ గంగాధర్ తిలక్ గా పుట్టిన బాల్ గంగాధర్ తిలక్ భారతీయ జాతీయవాది, ఉపాధ్యాయుడు , స్వతంత్ర కార్యకర్త. తిలక్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో మొదటి నాయకుడిగా చెప్పబడ్డాడు. బ్రిటిష్ వలస అధికారులుఆయన్ని భారత శాంతికి తండ్రి అని పొగిడారు. “ది మేకర్ ఆఫ్ మోడరన్ ఇండియా” అని మహాత్మా గాంధీ ఆయనను పిలిచారు. తిలక్ స్వరాజ్ యొక్క మొట్టమొదటి మరియు బలమైన న్యాయవాదులలో ఒకరు కావడం తో పాటు భారతీయ స్పృహలో బలమైన రాడికల్. స్వరాజ్యం అనేది నా జన్మహక్కు కాబట్టి నేను దానిని కలిగి ఉంటాను అన్న మహాను భావుడు.

Bala Gangadhar Tilak : జ్ఞాపకార్ధం:

1956 ,28 జూలైన, పార్లమెంటు హౌస్ సెంట్రల్ హాల్‌లో బి. జి. తిలక్ చిత్రంపెట్టబడింది. గోపాల్ డ్యూస్కర్ చే చిత్రించబడిన తిలక్ చిత్రపటాన్ని అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేత ఆవిష్కరించబడింది.
పూణేలోని థియేటర్ ఆడిటోరియం తిలక్ స్మారక్ రంగా మందిర్ ఆయనకు అంకితం చేసారు. 2007 లో, తిలక్ 150 వ జయంతి సందర్భం గా భారత ప్రభుత్వం ఒక నాణెం విడుదల చేయడం అనేది జరిగింది. లోకమాన్యతిలక్ జ్ఞాపకార్థం మాండలే జైలులో క్లాఫ్స్-కమ్-లెక్చర్ హాల్ నిర్మాణానికి బర్మా ప్రభుత్వం అధికారిక అనుమతి ని పొందింది. 35,000 ను భారత ప్రభుత్వం , 500, 7,500 ను బర్మాలోని స్థానిక భారతీయ సమాజం ఇవ్వడం జరిగింది.

Bala Gangadhar Tilak : ఎన్నో పాత్రలు :

సాంఘిక సేవారంగం లోకి ప్రవేశించి, విద్యావకాశాల మెరుగుదలకు విస్తృతంగాకృషిచేసిన మహానుభావుడు. రాజకీయ నాయకుడుగా, పాత్రికేయుడుగా బహుముఖంగా దేశానికి సేవచేసే భాగ్యం ఆయనకు దక్కింది అనడం లో ఎలాంటి సందేహం లేదు. బాల గంగాధర్ తిలక్ ముప్పదిమూడేళ్ళ ప్రజాహిత సేవారంగంలో ఎనిమిదేళ్ళ పాటు కారాగారంలో గడిపాడు. 1908లో కేసరి పత్రికలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వ్యాసం వ్రాశాడన్న రాసినందుకు కారణంతో 52 ఏళ్ళ బాలగంగాధర తిలక్ గారికి ఆరేళ్ళు దీర్ఘకాల శిక్ష విధించింది ఆనాటి ప్రభుత్వం. ఎన్ని అవాంతరాలు వచ్చిన ఎంతో మహోన్నత వ్యక్తి.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

4 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

5 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

6 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

6 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.