Earthquake టర్కీ ప్రస్తుతం వరుస భూకంపాలతో తల్లడిల్లి పోతోంది. ఫిబ్రవరి 6వ తేదీన టర్కీ , సిరియాలో భారీ భూకంపం సంభవించగా.. సుమారు 46 వేల మంది మరణించారు.. ఇంకా శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. మరొకవైపు లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు.. తాత్కాలిక శిబిరాలలో కొంతమంది తలదాచుకుంటున్నారు. ఈ ఘటన ఇంకా మరువకముందే ఇప్పుడు మరొకసారి టర్కీ హాతాయ్ ప్రావిన్స్ పరిసరాలలో మరొకసారి భూకంప అలజడలు సృష్టించబడ్డాయి.
ఈ భూకంపం వల్ల ముగ్గురు మరణించగా.. ఏకంగా 213 మంది ప్రాణులకు ప్రాణాపాయం తప్పింది.. స్వల్ప గాయాలతో వీరంతా బయటపడినట్లు సమాచారం భూకంప కేంద్రం డెఫ్నే నగర సమీపంలో ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు గుర్తించారు. టర్కీ, సిరియాలో సోమవారం 6.4 తీవ్రతతో భూమి కంపించినట్లు టర్కీ మంత్రి సులేమాన్ సోయ్లు తెలిపారు.. ఈ భూకంపం వల్ల అనేక భవనాలు, చెట్లు కూలిపోయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రెస్క్యూ టీం ఘటనస్థలిలో సహాయక చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ఒకవైపు ఈ భూకంప ప్రభావం జోర్డాన్, ఇజ్రాయిల్ దేశాల్లో కూడా స్వల్పంగా కనిపించింది.