Chaitra pournami : చైత్ర పౌర్ణమి ఎంతో విశేషమైన రోజు అయితే ఈ చైత్ర పౌర్ణమి గురువారం రావడం వల్ల ఈరోజుకు ఎంతో శక్తి ఉందని నమ్ముతారు. చైత్ర పౌర్ణమిని మహా పౌర్ణమి అని అంటారు. మన తెలుగు సంవత్సరాలు ఉగాదికి మొదటి పౌర్ణమి కావడం ఎంతో విశేషం. ఇలాంటి పవిత్రమై న రోజు ఎవరైతే స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి తీసుకుని స్నానం చేస్తారో..వారి ఒంట్లో మరియు ఇంట్లో ఉన్న దరిద్ర బాధలు అన్నీ పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆరోజు ఇలా స్నానం చేస్తే ఆ లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మనకు మంచి భోగభాగ్యాలు కలిగిస్తుంది.ఎలాంటి వైరస్లైన మన ఒంట్లోకి రాకుండా మన శరీరాన్ని రక్షిస్తుంది.
మరో ఎంతో శక్తివంతమైన ఈరోజు స్నానం చేసే నీటిలో చిటికెడు సముద్రపు ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకొని ఆ నీటితో స్నానం చేయడం వల్ల నరపీడ,నరగోషదృష్టి, దృష్టి దోషాలు, అన్నీ కూడా తొలగిపోయి. శరీరానికి దివ్య శక్తి వచ్చి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అలాగే చైత్ర పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం చేసుకుంటే ఎంతో శుభం కూడా కలుగుతుంది. మా వ్రతం చేయలేని వారు సత్యనారాయణ ఫోటోను పెట్టుకుని చామంతి పూలతో పూజ చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వలన సంవత్సరం అంతా ప్రతి పనిని దిగ్విజయంతో పూర్తి చేసుకోవచ్చు.ఇక ఈరోజు చంద్రుని పూజిస్తే రాతి చంద్రునికి నీరు అర్పించి ఇలా చేస్తే చంద్రుడు సంతోషించి మీ కోరికలను తప్పక నెరవేరుస్తాడని పురాణ వచనం.
ముఖ్యంగా ఇలాంటి పవిత్రమైన రోజు రాత్రి గడియల్లో ఇంట్లో విష్ణుమూర్తి ఫోటో ముందు తులసీదళములతో విష్ణుమూర్తికి పూజ చేయడం వల్ల ఆయన తనకు తానుగా ప్రసన్నుడై.మనకి మంచి శుభలాలను కలుగజేస్తాడు. ఎందుకంటే విష్ణుమూర్తికి తులసీదళాలంటే చాలా ఇష్టం.